Begin typing your search above and press return to search.
టాలీ, కోలీవుడ్ పై మల్లూవుడ్ దండయాత్ర
By: Tupaki Desk | 17 Aug 2015 3:46 PM GMTటాలీవుడ్ లో హిట్ లు ఉన్నా సరైన కథలు లేని సినిమాలే అన్న విమర్శ ఉంది. ఇక్కడ సినిమాలకు కథలు కరువు. క్రియేటివిటీ కరువు. అందుకే పొరుగు నుంచి సినిమాలు దండెత్తుతున్నాయని ప్రతిసారీ విమర్శకులు దుమ్మెత్తి పోస్తుంటారు. అది నిజమేనని మరోసారి నిరూపణ అవుతోంది. దృశ్యం మొదలు మలయాళం నుంచి వరుసగా హిట్ సినిమాలు టాలీవుడ్ పై దండెత్తనున్నాయి. అక్కడి సినిమాల్ని తెలుగులో రీమేక్ చేసేందుకు మన దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. సేమ్ టైమ్ తమిళ్ లోనూ మలయాళ సినిమాల హవా సాగుతోంది.
మోహన్ లాల్ కథానాయకుడిగా నటించిన దృశ్యం తెలుగుతో పాటు తమిళ్, హిందీలోనూ రీమేకై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత అదే కాన్ఫిడెన్స్ తో బెంగళూర్ డేస్ చిత్రాన్ని తెలుగు, తమిళ్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మెజారిటీ భాగం పూర్తయింది. మలయాళ హిట్ చిత్రం హౌ ఓల్డ్ ఆర్ యు 36 వయదినిలే పేరుతో తమిళ్ లో రీమేకై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అలాగే మమ్ముట్టి నటించిన భాస్కర్ ది రాస్కెల్ చిత్రం తెలుగులో రీమేకవుతోంది. వెంకటేష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
యువహీరో నివిన్ పాళీ కథానాయకుడిగా నటించిన సినిమాలన్నీ తెలుగు, తమిళ్ లో రీమేకవుతున్నాయి. ప్రేమమ్ రీమేక్ లో నటించేందుకు సూర్య, ధనుష్ రేసులో ఉన్నారు. ఈ ఇద్దరికీ ప్రొడక్షన్ హౌస్ లు ఉన్నాయి. రీమేక్ హక్కులు కొనేందుకు పోటీపడుతున్నాయని సమాచారం. నివిన్ పాళీ నటించిన ఒరు వడక్కన్ సెల్ఫీ 6 భాషల్లో రీమేకవుతోంది. నివిన్ కే చెందిన మరో స్పోర్ట్స్ డ్రామా 1983 కూడా రీమేక్ కి రెడీ అవుతోంది. ఇలా చూస్తే ఇంకా చాలా సినిమాలే లైన్ లో ఉన్నాయని అనుకోవాలి మరి.