Begin typing your search above and press return to search.

RC15 లో మ‌ల‌యాళీ జాతీయ అవార్డ్ న‌టుడు

By:  Tupaki Desk   |   28 Aug 2021 6:07 AM GMT
RC15 లో మ‌ల‌యాళీ జాతీయ అవార్డ్ న‌టుడు
X
సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్... టాలీవుడ్ హీరో రామ్ చరణ్ క‌ల‌యిక‌లో ఆర్.సి.15 తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా కేట‌గిరీలో ప‌లు భాష‌ల్లో ఈ చిత్రం రూపొంద‌నుంది. పొలిటికల్ యాక్షన్ డ్రామా క‌థాంశంలో చ‌ర‌ణ్ యువ ఐఏఎస్ గా.. ముఖ్య‌మంత్రిగా క‌నిపిస్తార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఈ మూవీ కోసం చ‌ర‌ణ్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్ప‌టికే ఈ సినిమాలో ప‌లు భాష‌ల నుంచి స్టార్ల‌ను ఎంపిక చేసుకోవ‌డంతో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. కియ‌రా అద్వాణీ- త‌మ‌న్నా- అంజ‌లి త‌దిత‌రులు ఇందులో న‌టిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం... జాతీయ అవార్డు గెలుచుకున్న మలయాళ నటుడు జయరామ్ ఓ కీలకమైన విల‌న్ పాత్ర కోసం ఎంపికయ్యారు. జయరామ్ ఇంతకు ముందు తెలుగులో భాగమతి- అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించారు. క‌ళ్యాణ్ రామ్ ఓం 3డిలోనూ న‌టించారు. జయరామ్ తదుప‌రి సంక్రాంతి రిలీజ్ ల‌కు వ‌స్తున్న‌ రాధే శ్యామ్- సర్కారు వారి పాట లోనూ క‌నిపించ‌నున్నారు.

ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని చ‌ర‌ణ్ చిత్రం లో అత‌డి పాత్ర ఎలా ఉంటుంది? అన్న‌ది చూడాలి. ఇది ఓ మాస్ పొలిటికల్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్క‌నున్న చిత్రం. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్ విల‌న్ గా న‌టిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ ను దిల్ రాజు నిర్మిస్తున్నారు.