Begin typing your search above and press return to search.

'డ్రెస్ తీసేయ్.. చూడాలన్నాడు' నిర్మాతపై నటి షాకింగ్ కామెంట్స్

By:  Tupaki Desk   |   22 April 2020 12:30 PM GMT
డ్రెస్ తీసేయ్.. చూడాలన్నాడు నిర్మాతపై నటి షాకింగ్ కామెంట్స్
X
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్ని మార్పులు జరిగినా క్యాస్టింగ్ కౌచ్ అనేది మాత్రం పెద్ద సమస్యగా మారింది. బుల్లితెర నుండి వెండితెర వరకు ప్రతీ లేడీ ఆర్టిస్ట్ ఏదో ఒక సందర్భంలో కాస్టింగ్ కౌచ్ కి గురైనవారే. ఇక తాజాగా మరో యువనటి ఒక సీనియర్ నిర్మాత పై ఎవరు ఊహించని విధంగా షాకింగ్ కామెంట్స్ చేసింది. బాలీవుడ్ కి చెందిన చెందిన యంగ్ యాక్ట్రెస్ మల్హార్ రాథోడ్ పలు సందర్భాల్లో ఎదుర్కొన్న చెడు సంఘటనలను చెప్పుకొచ్చింది. మల్హార్ మాట్లాడుతూ.. ఫిల్మ్ ఇండస్ట్రీలో కొందరు దర్శక నిర్మాతలు అవకాశం ఇస్తామని కోరిక తీర్చాలంటూ వేధిస్తారని.. మరికొందరైతే అవకాశాలు రాకుండా చేసి కెరీర్ పై దెబ్బ కొడతారని తెలిపింది. అదే విధంగా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోందని చెప్పుకొచ్చింది మల్హార్.

అంతేగాక 8సంవత్సరాల క్రితం.. ఒక సీరియల్ లో నటిగా అవకాశం ఇస్తానని.. 65ఏళ్ళ నిర్మాత రూమ్ లోకి రమ్మన్నాడట. డ్రెస్ తీసేయ్.. అంటూ అసభ్యకరంగా ప్రవర్తించాడట. ఒక్కసారిగా షాక్ తిని అతని తీరుపై కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయానని తెలిపింది. అలా జరిగిన తర్వాత ఎంతో మనోవేదనకు లోనైనట్లు చెబుతూ.. ఇండస్ట్రీలో ఇలాంటి కామాంధులు చాలా ఉన్నారని సీరియస్ గా కామెంట్స్ చేసింది.

అలాంటి సమయంలో నటిగా నిరూపించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసిందట. కుటుంబానికి కూడా ఆర్ధికంగా మల్హారే ఆధారం. అయితే అవకాశాల కోసం నేను ఎన్నడు చెడ్డ దారుల్లో నడవలేదు. నిజాయితీగా వచ్చిన పాత్రలను చేస్తూ ముందుకు సాగుతున్నట్లు మల్హర్ తెలిపింది.