Begin typing your search above and press return to search.
నిరాశలో నిర్మాత.. రెండు సినిమాలు OTT కి ధారాదత్తం
By: Tupaki Desk | 12 Jun 2021 4:30 AM GMTథియేట్రికల్ రిలీజ్ ఇప్పట్లో సాధ్యం కాదని కొందరు నిర్మాతలు తీవ్ర నిరాశలో ఉన్న వైనం బయటపడుతోంది. రెండు క్రేజీ మలయాళ చిత్రాల్ని నిర్మించిన ఆ నిర్మాత ఆవేదనే ఇందుకు సాక్ష్యం. అతడు థియేట్రికల్ రిలీజ్ కోసం వేచి చూడలేని ధైన్య స్థితిపై రాసిన లేఖ సంచలనంగా మారింది.
కారణం ఏదైనా కానీ మలయాళ చిత్ర పరిశ్రమలో తదుపరి రెండు ప్రాజెక్టులు మాలిక్ .. కోల్డ్ కేస్ OTT మార్గంలో సాగుతున్నాయి. ఫహద్ ఫాసిల్ .. పృథ్వీరాజ్ సుకుమారన్ కథానాయకులుగా తెరకెక్కిన రెండు ప్రాజెక్ట్ లను నిర్మించిన సీనియర్ నిర్మాత ఆంటో జోసెఫ్ ఇటీవల ఈ విషయాన్ని ధృవీకరించారు. మాలిక్ మరియు కోల్డ్ కేస్ రెండింటినీ విడుదల చేయడానికి ప్రముఖ OTT ప్లాట్ ఫామ్ తో చర్చలు సాగిస్తున్నామని తెలిపారు.
ఆంటో జోసెఫ్ కేరళ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ ఫెడరేషన్ కిరాసిన లేఖలో ఈ నివేదికలను ధృవీకరించారు. థియేటర్లను ఇప్పట్లో తిరిగి తెరవకపోవచ్చు.. కాబట్టి తన రెండు సినిమాల్ని OTT విడుదలకు ఎంచుకోవలసి ఉందని నిర్మాత తన లేఖలో పేర్కొన్నారు. తాను ఒక పెద్ద ఆర్థిక పోరాటం చేస్తున్నానని నిర్మాత ఆవేదన చెందదారు. ఇది తప్ప వేరే మార్గం లేదని ఆయన అన్నారు.
థియేటర్లలో విడుదల కోసం మాలిక్ బృందం దాదాపు రెండేళ్లపాటు ఎలా వేచి ఉందో ఈ లేఖలో వివరించారు. ఫహద్ ఫాసిల్ నటించిన ఈ చిత్రం మొదట 2020 లో విడుదల కావాల్సి ఉండగా... మొదటి మహమ్మారి కారణంగా ఈద్ 2021 కు వాయిదా పడింది.. అయితే సెకండ్ వేవ్ కారణంగా మాలిక్ విడుదల మళ్లీ రద్దయ్యింది. అదేవిధంగా కోల్డ్ కేస్ కూడా 2021లో థియేటర్లలోకి రానుంది. మాలిక్ చిత్రంలో ఫహద్ మూడు వేర్వేరు గెటప్‌లలో కనిపిస్తాడు.
కోల్డ్ కేస్ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఇది పూర్తి స్థాయి థ్రిల్లర్ చిత్రం. ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్ ఫిల్మ్ మేకర్ తనూ బాలక్ దర్శకత్వం వహించారు. కాప్ కథను ఆంటో జోసెఫ్.. సినిమాటోగ్రాఫర్ జోమోన్ టి.జాన్ .. ఎడిటర్ షమీర్ ముహమ్మద్ సంయుక్తంగా నిర్మించారు.