Begin typing your search above and press return to search.
వర్మకు 24 గంటల డెడ్ లైన్!
By: Tupaki Desk | 27 Dec 2016 6:13 PM GMT"వంగవీటి" సినిమా ఫలితం సంగతి కాసేపు పక్కనపెడితే... ఆ సినిమాతో వంగవీటి అభిమానులు.. ఆ సామాజిక వర్గంలోని కొంతమంది ప్రజలు.. పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా నేతలు దర్శకుడు వర్మ పై గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే! ఇప్పటికే వంగవీటి సినిమా విడుదల అనంతరం వంగవీటి రాధ, రంగా-రాధ అభిమాన సంఘాలు, కాపు నేతలు నాయకుల కామెంట్లకు సమాధానాలు చెబుతున్న వర్మకు తాజాగా రాజకీయ నాయకుల నుంచి కూడా విమర్శలు మొదలైపోయాయి. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లాది విష్ణు, రాం గోపాల్ వర్మపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రాం గోపాల్ వర్మ ఎవరి చెప్పు చేతల్లో ఉండి "వంగవీటి" సినిమాను ఈ విధంగా తీశారో చెప్పాలని నిలదీస్తున్నారు మల్లాది విష్ణు. ఈ మేరకు ఆ చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు తెలుపుతూ విజయవాడలో సబ్ కలెక్టర్ కు వినతిపత్రం అందించిన ఆయన, వర్మను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు వర్మపై విరుచుకుపడ్డారు.
అనంతరం మాట్లాడిన విష్ణు... వర్మతో తాము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని, వంగవీటి మోహనరంగా పై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ఇప్పటికే కాపుసంఘాలు, రంగా అభిమాన సంఘాలు హ్యూమన్ రైట్స్ కమిషన్ కు కంప్లైట్ చేసిన విధంగా రంగా జీవితాన్ని వర్మ వక్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో 24 గంటల్లో చిత్ర దర్శక, నిర్మాతలు చర్యలు తీసుకోని పక్షంలో జరగబోయే పరిణామాలకు వారే బాధ్యులు అవుతారని హెచ్చరిస్తున్నారు రంగా అభిమానులు!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/