Begin typing your search above and press return to search.
బాబూ.. మెలోడీ బంగారంలా ఉందమ్మా
By: Tupaki Desk | 10 July 2016 4:22 AM GMT''మల్లెల వానలా.. మంచు తుఫానులా.. ముంచేసిందో నీలో మంచితనం..'' అంటూ సాంగ్ ను రిలీజ్ చేసింది ''బాబూ బంగారం'' టీమ్. నిన్న సాయంత్రం ఒక ఎఫ్.ఎం.స్టేషన్ ద్వారా ఈ పాటను రిలీజ్ చేశారు. జిబ్రాన్ కంపోజ్ చేసిన ఈ పాట ఎలా ఉందంటారూ ఇంతకీ?
గతంలో 'రన్ రాజా రన్' 'జిల్' వంటి సినిమాల పాటలు వినగానే ఆకట్టేసుకున్నాయి. ఆ రెండు సినిమాలతో జిబ్రాన్ ఇక్కడ ఫుల్ పాపులర్ అయిపోయాడు. ఇప్పుడు ఈ పాట కూడా అంతే. వినగానే ఎక్కేస్తోంది. హీరోయిన్ ను చూసి.. నేను పడిపోయాను అంటూ వెంకటేష్ పాడే పాటంటూ ఇట్టే చెప్పేయొచ్చు. 'చూస్తున్నా చూస్తున్నా.. నను నీలో చూస్తున్నా' అంటూ సాగే హుక్ లైన్ కూడా బాగా ఎట్రాక్ట్ చేస్తోంది. అందుకే ఈ మెలోడీని బంగారం ఉందమ్మా అంటున్నారు మ్యూజిక్ లవర్స్.
తన గత సినిమాల్లో అంతగా పాపులర్ అవ్వని మ్యూజిక్ డైరక్టర్ల నుండే మాంచి దమ్మున్న ట్యూన్లు చేయించుకున్న మారుతి.. ఇప్పుడు జిబ్రాన్ వంటి టాలెంటడ్ కంపోజర్ ను వదిలిపెడతాడా. పిండేసినట్లున్నాడు. ఇంతకీ మిగతా ఆల్బమ్ అంతా ఎప్పుడు విడుదల చేస్తున్నారు.