Begin typing your search above and press return to search.
మల్లేశం దర్శకుడి బాలీవుడ్ మూవీ
By: Tupaki Desk | 14 April 2023 4:03 PM GMTమల్లేశం సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ రాజ్ రాచకొండ. తెలంగాణ మల్లేశం అనే చేనేత కార్మికుడి నిజజీవిత కథని తెరపై అంతే నేచురల్ గా ఆవిష్కరించి ఈ దర్శకుడు హిట్ కొట్టాడు. ప్రియదర్శికి ఈ మూవీ మంచి పేరు తీసుకొచ్చింది. పలు అవార్డులని సైతం ఆ మూవీ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే మల్లేశం మూవీకి రాజ్ రాచకొండ నిర్మాతగా కూడా వ్యవహరించారు.
ఈ మూవీ తర్వాత మలయాళంలో పక్కా అనే థ్రిల్లర్ మూవీని నిర్మించారు. ఇక చాలా గ్యాప్ తర్వాత హిందీలో ఇట్స్ 8 ఏఎమ్ మెట్రో అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. రియాలిటీకి దగ్గరగా ఉండే కథలని ఎంచుకొని సినిమాలు చేస్తోన్న రాజ్ రాచకొండ ఈ సినిమాలో కూడా అలాంటి ప్రయోగమే చేశారు.
ముంబై మెట్రో ట్రైన్ లో ప్రయాణించి ఇద్దరు అపరిచిత వ్యక్తుల మధ్య పరిచయం ప్రేమగా ఎలా మారింది అనే పాయింట్ తో ఈ మూవీని ఆవిష్కరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని తాజాగా ఆవిష్కరించారు. సయామీఖేర్, గుల్షన్ దేవయ్య ఈ మూవీలో లీడ్ పెయిర్ గా చేస్తున్నారు.
ఈ మూవీకి ప్రముఖ లెరిక్ రైటర్, పొయిట్ గుల్జార్ ప్రత్యేకంగా 6 పద్యాలని రాయడం విశేషం. హీరో, హీరోయిన్స్ మధ్య ప్రేమ సన్నివేశాలని ఎలివేట్ చేసే విధంగా ఈ పద్య గీతాలు ఉంటాయని తెలుస్తోంది. మరి మల్లేశం మూవీతో అందరి దృష్టిని ఆకర్షించి రాజ్ రాచకొండ ఈ సినిమాతో హిందీలో ఎలాంటి హిట్ అందుకుంటాడు అనేది చూడాలి.
చాలా కాలంగా రాజ్ రాచకొండ హిందీలో మూవీ చేయడం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. 2019లో మల్లేశం సినిమా ప్రేక్షకుల ముందుకి రాగా మరల నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు ఇట్స్ 8ఎఎమ్ మెట్రో అనే హిందీ సినిమా చేస్తూ ఉన్నారు. ఇక ఎక్కువగా మోడరన్ క్యారెక్టర్స్ లో దర్శనం ఇచ్చిన సయామీ ఖేర్ మొదటి సారిగా ఈ మూవీలో ట్రెడిషనల్ ఇండియన్ టచ్ ఉన్న మిడిల్ క్లాస్ విమెన్ గా కనిపిస్తోంది.