Begin typing your search above and press return to search.

`మ‌ల్లేశం` వాస్త‌విక‌త ఉన్న‌ బ‌యోపిక్!- ప్రియ‌ద‌ర్శి

By:  Tupaki Desk   |   20 Jun 2019 11:52 AM GMT
`మ‌ల్లేశం` వాస్త‌విక‌త ఉన్న‌ బ‌యోపిక్!- ప్రియ‌ద‌ర్శి
X
న‌ట‌న‌లోకి రాక‌ముందు ఓ కంపెనీలో ఉద్యోగం చేసి దానికి రాజీనామా ఇచ్చి అటుపై ల‌ఘు చిత్రాల‌తో న‌ట‌న ప్రాక్టీస్ చేసి.. 5000 పారితోషికంతో ఓ సినిమాలో న‌టించాన‌ని చెప్పారు ప్రియ‌ద‌ర్శి. క‌మెడియ‌న్ గా రాణించాక ఇమేజ్ స‌మ‌స్య లేకుండా సీరియ‌స్ పాత్ర‌ల్లో న‌టించాన‌ని వెల్ల‌డించారు. తాను టైటిల్ పాత్ర పోషించిన `మ‌ల్లేశం` ఈ శుక్ర‌వారం (జూన్ 21న‌) రిలీజ‌వుతున్న సంద‌ర్భంగా ప్రియ‌ద‌ర్శి మీడియాతో ముచ్చ‌టించారు.

సినిమాలు చేయ‌క ముందు.. ఒక గ్రాఫిక్స్ కంపెనీలో ప‌ని చేసేవాడిని. అయితే క్రైసిస్ వ‌ల్ల కంపెనీ జీతాలివ్వ‌లేని ప‌రిస్థితి. అయితే ఆ స‌న్నివేశం తెలిశాక జీతం అందుకుని బ‌ర్త్ డే పార్టీ చేసుకుని వ‌దిలేయాల‌ని అనుకున్నా. కానీ వాళ్లు బ‌ర్త్ డే టైమ్ కి శాల‌రీ ఇచ్చి పంపించేయ‌డం నా లైఫ్ లో పెద్ద మ‌లుపు. ఆ త‌ర్వాత ల‌ఘు చిత్రాల‌లో న‌టించ‌డం మొద‌లుపెట్టాను. ల‌ఘు చిత్రాలు తీసి వాటిని యూట్యూబ్ లో పెట్టేవాళ్లం. వాటికి ఒక మిలియ‌న్ లైక్స్ రావ‌డం అంటేనే ఎంతో గొప్ప‌. అలాగే సినిమాల కోసం రెగ్యుల‌ర్ గా ఆడిషన్స్ కి వెళ్లేవాడిని. అప్ప‌టికి నాకు ఇవ‌న్నీ కొత్త‌. ఉత్సాహంగా అదే ప‌నిలో ఉండేవాడిని

ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ మేము క‌లిసి ఓ ల‌ఘు చిత్రం చేశాం. అది చూసి క‌రీంన‌గ‌ర్ నిర్మాత ఒక‌రు సినిమాలో అవ‌కాశం ఇచ్చారు. రూ.5000 పారితోషికంతో ఆ సినిమా చేశాను. అయితే అది పూర్త‌యినా బ‌య‌టికి రాలేదు. అయితే అదంతా ఇక్క‌డ‌ కామ‌న్ బాధ‌ప‌డ‌కు అన్నారు. త‌ర్వాత `బొమ్మ‌ల రామారం` అనే సినిమాలో విల‌న్ పాత్ర‌లో ఛాన్స్ వ‌చ్చింది. ఆ టైమ్ లో థియేట‌ర్ ఆర్టిస్టులంద‌రూ అందులో న‌టించారు. నా గురువు గారు భిక్షు గారు న‌న్ను రిక‌మండ్ చేశారు. తెలుగు వ‌ర్శిటీ థియేట‌ర్ గ్రూప్స్ ఇత‌ర‌త్రా థియేట‌ర్ న‌టీన‌టుల్ని ఆ సినిమాకి తీసుకున్నారు. అది ఆశించినంత ఆడ‌లేదు. ఆ త‌ర్వాత ఘాజీ సినిమా చేశాం. అదే స‌మ‌యంలో ఆడిష‌న్స్ చేసి `పెళ్లి చూపులు`కు త‌రుణ్ న‌న్ను ఎంచుకున్నారు.

నాకు థియేట‌ర్ అనుభ‌వం లేదు. దానికి సూట్ కాన‌నే నేను అటువైపు వెళ్ల‌లేదు. భిక్షుగారు న‌ట‌న‌లో కొన్ని టెక్నిక్స్ చెప్పారు. దానివ‌ల్ల ఎంతో బెట‌ర్ అయ్యాను. నేను 2017 స‌మ‌యంలో `అ!` సినిమా చేస్తున్న‌ప్పుడు అజ‌య్ అనే రైట‌ర్ న‌న్ను చూసి `చింత‌కింది మ‌ల్లేశం` అనే బ‌యోపిక్ తీయాల‌నుకుంటున్నారు. వాళ్లు నీ గురించి అనుకుంటున్నార‌ని చెప్పారు. ఏదో వ‌స్తుందా? అనుకున్నాను. అప్ప‌టికే మ‌ల్లేశం గారికి ప‌ద్మ‌శ్రీ ఇచ్చార‌న్న‌ది విన్నాను. 2018 ఆగ‌స్టులో అమెరికా నుంచి నిర్మాత‌ రాజ్ వ‌చ్చి మ‌ల్లేశం ప్రాజెక్టు అనుకుంటున్నాం... మీరు చేయాలి అని అన్నారు. అలా మ‌ల్లేశం ప్ర‌యాణం మొద‌లైంది.

న‌న్ను ఇలా కూడా అనుకుంటున్నారా? ప‌ంచ్ లు వేసే పాత్ర‌లేనా? చేయాలి అని అనుకునేవాడిని. అయితే మ‌ల్లేశం స్క్రిప్టు ఎంతో ఆస‌క్తితో చ‌దివేశాను. సెట్స్ కి వెళ్లాం. స్వ‌త‌హాగా న‌టుడికి ఇమేజ్ అన్న‌ది శాపం లాంటిది అని నేను అనుకుంటాను. ఇండ‌స్ట్రీలో ప్ర‌తి ఒక్క‌రికి ఓ బాక్స్ వేసేస్తారు. ఇలా కంపార్ట్ మెంట్లు విభ‌జించ‌డం నాకు న‌చ్చ‌దు. అందుకే అలా ఉండాల‌నుకోలేదు. ఇండ‌స్ట్రీలో ప‌లువురు న‌టుల్ని కొత్త కోణంలో చూడాల‌నే అనుకుంటాను. నేనూ అలానే ఉండాల‌నుకుంటాను... అని ద‌ర్శి ప‌రిశ్ర‌మ‌ను విశ్లేషించారు.

పెళ్లి చూపులు త‌ర్వాత ఓ ఆస‌క్తిక‌ర అనుభ‌వం గురించి ప్రియ‌ద‌ర్శి రివీల్ చేశారు. ``పెళ్లి చూపులు త‌ర్వాత ఘాజీ రిలీజైంది. పెళ్లి చూపులు చూసిన వాళ్లు త‌ర్వాత ఘాజీ చూసి నా డైలాగులు విని న‌వ్వుతున్నారు`` ఇదేంటి అలాంటి ఇమేజ్ వ‌చ్చింది అనుకున్నా. అప్ప‌టివ‌ర‌కూ కామెడీ చేసి సీరియ‌స్ చేస్తే ఏమ‌వుతుందో? అనిపించింది. వైఫ్ ఆఫ్ రామ్ .. క‌ణం చిత్రాల్లో కామెడీ కాకుండా కొంచెం కొత్త‌గా చేయ‌గ‌ల‌డ‌ని నిరూపించాను. ఇప్పుడు మ‌ల్లేశం పాత్ర‌లో పూర్తిగా డిఫ‌రెంట్ గా చేసే ప్ర‌య‌త్నం చేశాను. ఆయ‌న నుంచి స్ఫూర్తి పొంది.. త‌న‌లా న‌టించేందుకు ప్ర‌య‌త్నించాను. ఆయన చాలా త‌క్కువ మాట్లాడ‌తారు. అవ‌న్నీ నేర్చుకుని మ‌ల్లేశం పాత్రలో చేశాను.. అని ప్రియ‌ద‌ర్శి తెలిపారు. చాలా సినిమాల‌ను నిజ జీవిత‌క‌థ‌ల నుంచి స్ఫూర్తి పొంది తీస్తున్నామ‌ని అంటున్నారు.. కానీ తెలుగులో అలాంటివి త‌క్కువే. ఒరిజిన‌ల్ లైఫ్ ని మార్చి చూపిస్తున్నారు. అలా కాకుండా వాస్త‌వ జీవితాన్ని చూపించిన బ‌యోపిక్ మ‌ల్లేశం బ‌యోపిక్ అని త‌న అభిప్రాయం వెల్ల‌డించారు.