Begin typing your search above and press return to search.
మగ్గం వీరుడి కథ - ట్రైలర్ టాక్
By: Tupaki Desk | 29 May 2019 12:19 PM GMTబాగా పేరున్న సెలబ్రిటీలనో లేదా స్పోర్ట్ స్టార్స్ లేదా రాజకీయ నాయకులవో బయోపిక్ లు వస్తున్న ట్రెండ్ లో మగ్గం నేతతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న చింతకింది మల్లేష్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న మల్లేశం ట్రైలర్ ఇందాకా విడుదల చేశారు. టైటిల్ రోల్ లో ప్రియదర్శి నటించగా ఇతర కీలక పాత్రల్లో అనన్యతో పాటు సీనియర్ నటి ఝాన్సీ చేశారు. ట్రైలర్ లో చాలా స్పష్టంగా థీమ్ ని ప్రెజెంట్ ని చేశారు.
నల్గొండ బ్యాక్ డ్రాప్ లో మల్లేశం బాల్యంతో మొదలుపెట్టి వయసులోకి వచ్చాక తన స్నేహితులతో కలిసి ఊరిలో వేసిన వేషాలు మగ్గం వేసి వేసి తల్లి భుజాలు కుంగిపోయి చేతులు పోయే ప్రమాదాన్ని డాక్టర్ హెచ్చరించడం దాకా అంతా సహజంగా ఉంది. మల్లేశం ఇష్టపడిన అమ్మాయి పద్మ కోసం అతను పడే అగచాట్లు సినిమా టికెట్ల కోసం ఎగబడటం ఇదంతా తెలంగాణా పల్లె నేపధ్యంలో మంచి ఫీల్ తో ప్రెజెంట్ చేశారు
మగ్గం వేసే కుటుంబ వృత్తిలో ఉంటూ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు మల్లేశం. అయితే అప్పుల కారణంగా నాన్న నానా మాటలు పడటం చూడలేక అది వదిలేసి సిటీలో ఆటో తోలడం మొదలుపెడతాడు. అక్కడ ఇమడలేక పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్న సూత్రంతో ఇంటికి తిరిగి వచ్చి మళ్ళి మగ్గం అందుకుంటాడు. అక్కడి నుంచి కొత్త సవాళ్ళు ఎదురవుతాయి. ఆరో క్లాసు వదిలేసిన మల్లేశం ఇంజనీర్ ఎలా అయ్యాడు మగ్గం పట్టిన చేతులతో పద్మశ్రీ అవార్డు తీసుకునే స్థాయికి ఎలా ఎదిగాడు అదే ఈ చిత్ర కథ
ప్రియదర్శి మల్లేశంగా ఒదిగిపోయాడు. వెటకారపు కామెడీతో నవ్వించే ఇతనిలో ఇంత మంచి పెర్ఫోర్మార్ ఉన్నాడనే సత్యం దీంట్లో చూడొచ్చు. అతని తల్లిగా ఝాన్సీ తండ్రిగా చేసిన నటుడు అందరూ పాత్రలకు తగ్గట్టు బాగా సూటయ్యారు. హీరొయిన్ అనన్య లుక్స్ తో పాటు నటన పరంగా కూడా ఆకట్టుకునేలా ఉంది.
దర్శకుడు రాజ్ ఆర్ టేకింగ్ చాలా న్యాచురల్ గా ఉంది. తెలంగాణా స్లాంగ్ ని ఉపయోగించిన తీరు అప్పటి పల్లె వాతావరణాన్ని ఒడిసిపట్టి తెరమీద ఆవిష్కరించిన నైపుణ్యం ఆకట్టుకుంటాయి.పెద్దింటి అశోక్ కుమార్ సంభాషణలు ప్రధాన బలంగా నిలిచాయి మార్క్ కే రాబిన్స్ సంగీతం మల్లేశం థీమ్ కి సింక్ అయ్యేలా బాగా కుదిరింది. మొత్తానికి ఓ సామాన్యుడి బయోపిక్ గా బయోపిక్ గా రూపొందిన మల్లేశం మనసులు గెలిచేలాగే ఉంది