Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ : మళ్ళీ పెళ్ళి
By: Tupaki Desk | 27 May 2023 5:28 AM IST'మళ్ళీ పెళ్ళి' మూవీ రివ్యూ
నటీనటులు: నరేష్-పవిత్ర లోకేష్-వనిత విజయ్ కుమార్-జయసుధ-శరత్ బాబు-అన్నపూర్ణమ్మ తదితరులు
సంగీతం: సురేష్ బొబ్బిలి-అరుల్ దేవ్
నేపథ్య సంగీతం: అరుల్ దేవ్
ఛాయాగ్రహణం: బాల్ రెడ్డి
నిర్మాత: నరేష్
రచన-దర్శకత్వం: ఎం.ఎస్.రాజు
హీరో వేషాలు ఆగిపోయాక పాతికేళ్లుగా క్యారెక్టర్ రోల్సే చేస్తున్నారు సీనియర్ నటుడు నరేష్. కానీ ఆయన కెరీర్లో ఈ దశలో.. ఈ వయసులో 'మళ్ళీ పెళ్ళి' అంటూ హీరోగా సినిమా చేశారు. దీనికి ఆయనే నిర్మాత కాగా.. ప్రొడ్యూసర్ టర్న్డ్ డైరెక్టర్ ఎం.ఎస్.రాజు ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రోమోలు చూస్తే నరేష్ నిజ జీవిత అంశాలతో ముడిపడ్డ కథగా కనిపించి ఆసక్తి రేకెత్తించిన 'మళ్ళీ పెళ్ళి'.. సినిమాగా ఏ మేర ఆకట్టుకుందో చూద్దాం పదండి.
కథ:
నరేందర్ (నరేష్) తెలుగులో ఒక సీనియర్ నటుడు. ఆయనకు నటుడిగా గొప్ప పేరుంటుంది. వందల కోట్ల ఆస్తి కూడా ఉంటుంది. కానీ తన గయ్యాళి భార్య వల్ల ఇబ్బంది పడుతూ వ్యక్తిగత జీవితంలో ప్రశాంతత లేకుండా గడుపుతుంటాడు. అలాంటి పరిస్థితుల్లో తన సహ నటి అయిన పార్వతి (పవిత్ర లోకేష్)ని చూసి మనసు పడతాడు. ఆమెకు కూడా ఆయన పట్ల ఆసక్తి ఉంటుంది కానీ.. అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలుంటారు. ఈ కుటుంబ బంధం నుంచి బయటికి రాలేకపోతున్న ఆమె.. ఒకానొక దశలో నరేందర్ కు దగ్గరవుతుంది. మరి వీరి బంధానికి ఎదురైన అడ్డంకులేంటి.. వాటిని ఆ జంట ఎలా అధిగమించింది అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
నరేష్ ఏమీ పెద్ద స్టార్ కాదు. పైగా దశాబ్దాల కిందటే ఆయన హీరో వేషాలు పక్కన పెట్టేశారు. క్యారెక్టర్ రోల్సుకే పరిమితం అయ్యారు. అలాంటి నటుడు ఇప్పుడు హీరోగా సినిమా చేస్తే ఎవరు చూస్తారు? అయినా సరే ఆయన ప్రధాన పాత్ర పోషించిన సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది. అందుక్కారణం.. నరేష్ నిజ జీవిత కథలా అనిపించడం.. ఆ కథలో ఆయనతో కొన్నేళ్ల నుంచి సహజీవనం చేస్తున్న పవిత్ర లోకేష్ జోడీగా నటించడం. మామూలుగానే నరేష్ బయట ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ లాగా కనిపిస్తారు. ఇక లేటు వయసులో పవిత్ర లోకేష్ తో ఆయన బంధం అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది. మరి వీరి మధ్య బంధం ఎలా మొదలైంది.. ప్రస్తుతం వీరి బంధం ఏ స్థాయిలో ఉంది.. తన మూడో భార్యతో నరేష్ కు గొడవలేంటి అనే విషయాలు తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ జనాల్లో ఉన్న మాట వాస్తవం. ఈ ప్రశ్నలకు సింపుల్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టో.. లేదంటే ఒక ఇంటర్వ్యూ ఇచ్చో సమాధానాలు చెప్పేస్తే పోయేది. కానీ నరేష్ మాత్రం ఏకంగా సినిమా తీయించేశాడు. అదే.. మళ్ళీ పెళ్ళి.
మళ్ళీ పెళ్ళి నరేష్-పవిత్రల సొంత కథేనా అని వాళ్లిద్దరినీ అడిగినా.. దర్శకుడు ఎం.ఎస్.రాజును అడిగినా ఎవ్వరూ కూడా సూటిగా సమాధానం చెప్పలేదు. కొన్ని వాస్తవాలు ఉంటాయి. కొంత కల్పితం ఉంటుంది అంటూ సమాధానం దాటవేయడానికి చూశారు. తాము ఎవ్వరినీ టార్గెట్ చేయట్లేదని అన్నారు. కానీ సినిమా మొదలైన కాసేపటికే ఆ భ్రమలన్నీ వీడిపోతాయి. ఇది పక్కాగా ఒక ప్రాపగండా ఫిలిం. నరేష్.. పవిత్రల కోణంలో ఏకపక్షంగా సాగిపోయే సినిమా. తమకు పూర్తి అనుకూలంగా.. తమ జీవితంలో ఉన్న వ్యక్తులను పెద్ద విలన్లుగా చిత్రీకరిస్తూ నరేష్.. పవిత్ర తీయించుకున్న సినిమాలా కనిపిస్తుందే తప్ప ఒక న్యూట్రల్ మూవీ చూస్తున్న భావన ఎంతమాత్రం కలగదు. నరేష్.. పవిత్రల వ్యక్తిగత జీవితాల్లో జరిగిన విషయాల్లో ఎవరు రైట్.. ఎవరు రాంగ్ అని మనం చెప్పలేం. కానీ సినిమా చూస్తే మాత్రం వీళ్లిద్దరూ ఉత్తమలు.. వాళ్ల భాగస్వాములు పరమ దుర్మార్గులు అనేలా చిత్రీకరించారు. నరేష్. . పవిత్రల వీరాభిమానులకు.. తెర మీద చూపించేదంతా నిజం అనుకున్న వాళ్లకు ఈ సినిమా కొంచెం కనెక్ట్ కావచ్చేమో. మిగతా వాళ్లకు మాత్రం ఇదొక ప్రాపగండా ఫిలిం లాగే అనిపిస్తుంది. నరేష్ పవిత్ర కలవడానికి ముందు.. కలిసినపుడు.. ఆ తర్వాత ఏం జరిగిందో సీన్ బై సీన్ సీరియల్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుందే తప్ప ఇది ఒక సినిమా అనే భావన ఏ కోశానా కలగదు.
నిజ జీవిత వ్యక్తుల జీవితాల మీద సినిమాలు తీయడం కొత్తేం కాదు. బయోపిక్స్ అంటూ ఇందుకు ఒక జానరే ఉంది. ఐతే ఆ వ్యక్తుల జీవితాల్లో జనాలను ఆకర్షించే.. ఆసక్తి రేకెత్తించే అంశాలు ఉండాలి. వాటిని తెర మీద అంతే ఆసక్తికరంగా చూపించాలి. ఐతే మళ్ళీ పెళ్ళిలో ఒక సినిమాగా తీయాల్సినంత కంటెంట్ ఏమాత్రం లేదు. సినిమాలో నరేష్ వెయ్యికోట్ల ఫిగర్ అని వేరే వాళ్లతో అనిపించుకోవడమే కాక.. తనకు తాను వందల కోట్ల డబ్బుంది అని చెప్పుకుంటాడు. ఆయనకు డబ్బుంది కాబట్టి అనేకానేక సందేహాలకు తావిచ్చిన తన వ్యక్తిగత జీవితం గురించి తనకు అనుకూలమైన ఒక వెర్షన్ చూపించడానికి ఈ సినిమా తీయించుకున్నట్లు అనిపిస్తుంది. ఆరంభం నుంచి సన్నివేశాలు మరీ ఏకపక్షంగా ఉండటంతో కాసేపటికే ఆసక్తి సన్నగిల్లిపోతుంది. మనం బయట చూసి ఏదో అనుకున్న ప్రతి విషయానికీ వెనుక ఇంకేదో జరిగినట్లుగా.. నరేష్-పవిత్ర ఒకరి తర్వాత ఒకరు తమ వెర్షన్లు చూపిస్తూ వెళ్తారు తప్ప ఈ కథలో సగటు ప్రేక్షకుడికి ఆసక్తి రేకెత్తించే విషయాలు పెద్దగా లేవు. ఒక దశ దాటాక మరీ సోది వ్యవహారంలాగా తయారై మళ్ళీ పెళ్ళి విసుగెత్తిస్తుంది. నరేష్.. పవిత్ర ఇంటికి వెళ్లి ఆమె భర్తకు బుద్ధి చెప్పి ఆమెను తీసుకొచ్చే లాంటి కొన్ని సీన్లు తప్ప.. ఒక స్క్రీన్ ప్లేతో ఇంట్రెస్టింగ్ గా కనిపించే సన్నివేశాలు లేవందులో. నరేష్-పవిత్రల వ్యక్తిగత బంధం గురించి ఎంత క్యూరియాసిటీ ఉన్నా కూడా.. రెండుంబావు గంటల పాటు ఈ సినిమాను భరించాలంటే చాలా ఓపిక కావాలి.
నటీనటులు:
నరేష్ బేసిగ్గా గొప్ప నటుడే. ఎలాంటి పాత్ర ఇచ్చినా సులువుగా ఒదిగిపోతాడు. తన ఇమేజ్ అస్సలు అడ్డం పడనివ్వడు. ఐతే మళ్ళీ పెళ్ళీలో చేసింది నిజ జీవిత పాత్ర కావడంతో ఆయనకు వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్ ఆయనలోని నటుడికి అడ్డం పడింది. రియల్ నరేష్ ను చూస్తుంటాం తప్ప.. నటుడిగా ఆయనెలా చేస్తున్నాడు అన్నది అర్థం కాదు. మరీ ఉత్తముడిలా తనను తాను ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటే.. ఇదంతా అన్న సందేహం కలుగుతుంది. ఆయన పెర్ఫామెన్స్ ఓకే. నరేష్ తో పోలిస్తే పవిత్ర లోకేష్ పాత్ర.. తన నటన సహజంగా అనిపిస్తాయి. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. విజయ నిర్మలగా జయసుధ ఓకే కానీ.. నరేష్‌కు తల్లిగా మాత్రం అంత సెట్ కాలేదు. కృష్ణ పాత్రలో శరత్ బాబు ఒకట్రెండు సీన్లలో కనిపించి ఓకే అనిపించారు. అన్నపూర్ణమ్మ బాగానే చేసింది. నరేష్ మూడో భార్య పాత్రలో వనిత విజయ్ కుమార్ పరమ శాడిస్టులా నటించి మెప్పించింది. కానీ ఈ పాత్రలో చెడు లక్షణాల్ని పనిగట్టుకుని పెంచి చూపించినట్లు అనిపిస్తుంది. పవిత్ర భర్త పాత్ర కూడా అంతే.
సాంకేతిక వర్గం:
సాంకేతిక విభాగాల గురించి ప్రత్యేకంగా చెప్పుకునేంత సినిమా కాదిది. సురేష్ బొబ్బిలి.. అరుల్ దేవ్ సంగీం సోసోగా అనిపిస్తుంది. శ్లోకం తరహాలో సాగే పాట ఒకటి కొంచెం ప్రత్యేకంగా అనిపిస్తుంది. అరుల్ బ్యాగ్గౌండ్ స్కోర్ పర్వాలేదు. బాల్ రెడ్డి ఛాయాగ్రహణం సోసోగా సాగిపోయింది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లుగా ఉన్నాయి. కథకుడు.. దర్శకుడు ఎం.ఎస్.రాజు ఎలాంటి ప్రత్యేకతా చాటుకోలేకపోయాడు. బోల్డ్ ఫిలిం.. సెన్సేషనల్ ఫిలిం అంటూ ఆయన చెప్పుకున్న స్థాయిలో ఎంతమాత్రం లేదీ సినిమా. జస్ట్ నరేష్.. పవిత్ర చెప్పినట్లు.. వాళ్లకు అనుకూలంగా ఒక వెర్షన్ తీసి ఇచ్చారంతే.
చివరగా: మళ్ళీ పెళ్ళి.. నరేష్-పవిత్రల రియల్ సీరియల్
రేటింగ్-2/5
Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater