Begin typing your search above and press return to search.
మళ్లీ పెళ్లి టీజర్: నరేష్ లైఫ్ మొత్తం దింపేశారుగా!
By: Tupaki Desk | 21 April 2023 11:24 AM GMTనరేష్ పవిత్రా లోకేష్.. వీరిద్దరి గురించి, వారి పెళ్లి గురించి జరిగినంత చర్చ ఏ సెలబ్రిటీ విషయంలోనూ జరిగి ఉండదు. అంతగా సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు నరేష్ పవిత్రలు. వీరిద్దరి ప్రేమ, సహజీవనం, ఆ తర్వాత వచ్చిన వివాదాలు తెగ ట్రెండ్ అయ్యాయి. ఏ ఇద్దరు నెటిజన్లు కలిసినా నరేష్ పవిత్రల గురించే చర్చ జరిగిందంటే అతిశయోక్తి కాదు.
వీరి ప్రణయం మరో రేంజ్ కు వెళ్లిందనే చెప్పాలి. ఆ మధ్య లిప్ కిస్ చేసుకుంటున్న వీడియో వైరల్ కాగా ఇప్పుడు ఏకంగా 'మళ్లీ పెళ్లి'తో ముందుకొచ్చారు. నరేష్ పవిత్ర ఇద్దరూ కలిసి 'మళ్లీ పెళ్లి' అనే సినిమాలో నటించారు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఈరోజు విడుదల అయింది.
అందులో నరేష్ లైఫ్ గురించి మొత్తం చూపించినట్లుగా అర్థం అవుతోంది. ముఖ్యంగా రమ్య రఘుపతి, నరేష్ ల పెళ్లి, ఆ తర్వాత పవిత్రా లోకేష్ తో స్నేహం, ప్రేమ, డేటింగ్ గురించి ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా తెలుగు ఇండస్ట్రీ కన్నడ వైపు చూపు తిప్పిందేంటి అనే వాయిస్ ఓవర్ తో మళ్లీ పెళ్లి టీజర్ మొదలైంది. అయితే రమ్య రఘుపతి స్థానంలో వనితా విజయ్ కుమార్ కనిపించారు.
వనితా మీడియాతో మాట్లాడుతూ తాను మోసపోయానని వెల్లడించడంతో టీజర్ ప్రారంభం అవుతుంది. అయితే ఆమె తన భర్తను మృగం అని చెప్పగా.. నరేష్ పవిత్రా లోకేష్ తో సంతోషకరమైన జీవితాన్ని గడపడం కనిపిస్తుంది.
తెలుగుతో పాటు కన్నడ భాషల్లో రాబోతున్న ఈ చిత్రాన్ని విలక్షణమైన కథతో పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. ఈ సినిమాకు ఎమ్ఎస్ రాజు దర్శకత్వం వహించగా, విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో పవిత్రా లోకేష్, నరేష్ తో పాటు వనితా విజయ్ కుమార్, జయసుధ, శరత్‌బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే అనన్య నాగళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి మరియు అరుల్‌దేవ్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందించారు. అలాగే ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, జునైద్ సిద్ధిక్ ఎడిటర్ గా వ్యవహరించగా.. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు.