Begin typing your search above and press return to search.
చరణ్ కి గాళం వేస్తే చిరు దొరికాడా?
By: Tupaki Desk | 17 April 2023 5:00 AM GMTబింబిసారా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ట మల్లిడి. మొదటి సినిమా అయిన రెండు భిన్నమైన కాలాలని ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఎమోషన్స్ ని బలంగా ప్రెజెంట్ చేసిన వశిష్ట మల్లిడి దర్శకుడిగా కూడా ప్రశంసలు అందుకున్నారు. ఇక ఈ మూవీ తర్వాత రెండో సినిమాని స్టార్ హీరోతో ప్లాన్ చేస్తోన్న వశిష్ట మల్లిడి సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఒక చెప్పినట్లు గతంలో ప్రచారం నడిచింది.
అయితే ఇందులో వాస్తవం ఎంత అనేది క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో వశిష్ట మల్లిడి మూవీ ఫైనల్ చేసుకున్నారు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ నిర్మించనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కూడా సోషియో ఫాంటసీ కథాంశంతోనే ఉండబోతోంది అనే మాట వినిపిస్తోంది.
త్వరలో మూవీకి సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా రావొచ్చని భావిస్తున్నారు. భోళా శంకర్ మూవీ కంప్లీట్ అయిన వెంటనే సెప్టెంబర్ నుంచి వశిష్ట మల్లిడి సినిమాని స్టార్ట్ చేయడానికి మెగాస్టార్ ప్లాన్ చేసుకున్తున్నారంట. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి మరో ఇంటరెస్టింగ్ టాక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
నిజానికి వశిష్ట మల్లిడి రామ్ చరణ్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో చెర్రి కోసం మెగాస్టార్ కి స్టొరీ నేరేషన్ ఇస్తున్నారు. అదే సమయంలో మెగాస్టార్ కోసం ఒక లైన్ ఉందని చెప్పడం, దానిని వశిష్ట చిరంజీవికి నేరేట్ చేయడం జరిగిపోయింది. ఇక చిరుకి కథ నచ్చడంతో వెంటనే దానిని డెవలప్ చేయాలని వశిష్టకి మెగాస్టార్ సూచించారంట.
దీంతో దర్శకుడు కూడా చరణ్ ప్రాజెక్ట్ పక్కన పెట్టి మెగాస్టార్ కి స్క్రిప్ట్ రెడీ చేయడంపై దృష్టి పెట్టారంట. ఇక ఈ మూవీ విజువల్ ఎఫెక్ట్స్ తో గ్రాండియర్ గా ఆవిష్కరించడానికి వశిష్ట సిద్ధం అవుతున్నారంట.
ఇక యూవీ క్రియేషన్స్ కూడా వంద కోట్ల వరకు మూవీపై బడ్జెట్ పెట్టడానికి రెడీ అయ్యిందంట. త్వరలో మూవీకి సంబందించిన అఫీషియల్ ప్రకటన వస్తుందని అందరూ భావిస్తున్నారు.