Begin typing your search above and press return to search.
హాట్ బ్యూటీ నడుముపై చపాతీలు కాల్చే సీన్ తీయాలని అనుకున్నారట..!
By: Tupaki Desk | 12 Nov 2021 12:30 AM GMTబాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా షెరావత్ గురించి సినీ అభిమానులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. 'మర్డర్' 'ఖ్వైష్' వంటి చిత్రాల్లో తన గ్లామర్ తో అందరి దృష్టిని ఆకర్షించిన మల్లిక.. పలు భారతీయ భాషలతో పాటుగా ఇంగ్లీష్ - చైనీస్ భాషల్లోనూ సినిమాలు చేసింది. ఇప్పుడు వెబ్ సిరీస్ లలోనూ సత్తా చాటుతోంది ఈ 46 ఏళ్ల బ్యూటీ. అయితే మల్లిక ఇటీవల ఓ లైవ్ షో మాట్లాడుతూ ఇండస్ట్రీలో తనకు ఎదురైన ఆసక్తికరమైన అనుభవాల గురించి వెల్లడించింది.
'ది లవ్ లాఫ్ లైవ్ షో' లైవ్ షోలో పాల్గొన్న మల్లికా శెరావత్.. ఒక సినిమా షూటింగ్ సమయంలో నిర్మాతతో తనకు ఎదురైన విచిత్రమైన అనుభవాన్ని చెప్పారు. ఒక పాట షూట్ చేస్తున్నప్పుడు మల్లికా నడుము మీద చపాతీలు కాల్చే సన్నివేశాన్ని తీయాలని చిత్ర నిర్మాత డిమాండ్ చేశారట. దానికి షాక్ అయిన మల్లికా వెంటనే ఆ సీన్ చేయడానికి నిరాకరించినట్లు తెలిపారు.
మల్లికా మాట్లాడుతూ.. ''పాట చిత్రీకరణ సమయంలో నిర్మాత తన వద్దకు వచ్చి 'ఇది చాలా హాట్ సాంగ్.. మీరు హాట్ గా ఉన్నారని ప్రేక్షకులకు ఎలా తెలుస్తుంది? అందుకే మీరు చాలా వేడిగా ఉన్నారని ప్రేక్షకుడికి అర్ధమయ్యేలా మీ నడుముపై చపాతీ కాలుస్తారని అన్నాడు'' అని చెప్పింది. నిర్మాత వింత డిమాండ్ ను నెరవేర్చడానికి తాను నిరాకరించానని.. కాకపోతే అది చాలా ఫన్నీ ఐడియా అని తరువాత అనుకున్నానని చెప్పుకొచ్చింది.
''భారతదేశంలో మహిళలకు సంబంధించిన హాట్ నెస్ భావన చాలా వింతగా ఉంది. అది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడ్డాయని నేను అంగీకరిస్తున్నాను. కానీ నా కెరీర్ ప్రారంభించినప్పుడు మాత్రం అది చాలా వింతగా అనిపించేది'' అని మల్లికా తెలిపారు.
అంతకముందు ఓ ఇంటర్వ్యూలో మల్లికా మాట్లాడుతూ.. ''నేను శృంగార సన్నివేశాల్లో నటించినప్పుడు నైతికంగా చనిపోయిన ఫీలింగ్ వచ్చేది. అంతలా అవి నాపై బోల్డ్ హీరోయిన్ అనే ముద్రను వేశాయి. నేను అప్పుడు చేసిన సన్నివేశాలు ఇప్పుడు సినిమాల్లో సర్వసాధారణం అయిపోయాయి. ప్రజల దృష్టి కూడా మారిపోయింది. అందుకే వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. అయినా ఇప్పటి సినిమాల్లో మహిళా సాధికారిత పెద్దగా కనిపించట్లేదు. ఆడవాళ్లకు మంచి పాత్రలు రావడం లేదు'' అని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇకపోతే మల్లికా శెరావత్ తెలుగు సినిమా చేయకపోయినా ఆమెకు టాలీవుడ్ లో కూడా క్రేజ్ ఉంది. గతంలో చాలామంది దర్శకనిర్మాతలు ఆమెను తెలుగు ఇండస్ట్రీకి తీసుకురావాలని ప్రయత్నాలు చేశారు కానీ.. వర్కవుట్ కాలేదు. అయితే ఇన్నాళ్లకు మల్లికా తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'నాగమతి' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న త్రిభాషా చిత్రంలో హాట్ భామ నటిస్తోంది. అమ్రిష్ గణేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముంబైలో ప్రారంభమైంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.