Begin typing your search above and press return to search.
ఏళ్ల క్రితం నేను చేసిందే దీపిక చేసింది!-మల్లికా శెరావత్
By: Tupaki Desk | 16 July 2022 5:30 AM GMTబాలీవుడ్ లో శృంగార నాయికగా పాపులరైన మల్లికా శెరావత్ .. చాలా కాలంగా పరిశ్రమకు దూరమైన సంగతి తెలిసిందే. ఇంత కాలానికి రజత్ కపూర్ తెరకెక్కిస్తున్న RK/RKay తో పునఃప్రవేశం చేస్తోంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా మల్లికా శెరావత్ చేసిన ఓ కామెంట్ హాట్ టాపిక్ గా మారింది.
ఇండస్ట్రీలోని ఒక వర్గం తన గ్లామర్ గురించి శరీరాకృతి గురించి ఎలా మాట్లాడుతుందో వెల్లడిస్తూ.. నటిగా తాను ఎంత గొప్పగా కనిపించినా దాని గురించి పట్టించుకోలేదని వాపోయింది మల్లిక. 'మర్డర్' చిత్రంలో తన పాత్రను 'గెహ్రైయాన్'లో దీపిక పాత్రతో పోల్చింది. గెహ్రైయాన్ లో దీపికా పదుకొనే ఏం చేసిందో నేను 15 సంవత్సరాల క్రితం అదే చేసానని మల్లిక తాజా ఇంటర్వ్యూలో అన్నారు.
మల్లికా శెరావత్ 2002లో 'జీనా సిర్ఫ్ మెర్రే లియే' చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అయితే ఇమ్రాన్ హష్మీతో కలిసి నటించిన 'మర్డర్'తో బ్లాక్ బస్టర్ అందుకుంది. అనురాగ్ బసు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఘాటైన లిప్ లాక్ లు బెడ్ రూమ్ సన్నివేశాలతో మల్లిక ఒక రేంజులో చెలరేగింది. మర్డర్ మూవీతో శృంగార నాయికగా పాపులరైంది. నాటి నుంచి తనను ప్రజలు పరిశ్రమ వ్యక్తులు కొత్తగా చూడటం ప్రారంభించారు. ఆ తర్వాతా మల్లికకు శృంగార నాయిక అనే బ్రాండ్ అలా మిగిలిపోయింది. దానివల్ల తాను ఎంత గొప్పగా నటించినా అవేవీ కనిపించలేదు.
ఇదే విషయంపై మల్లికా శెరావత్ తాజా ఇంటర్వ్యూలో ఓపెనైంది. నేటితరం హీరోయిన్లు తమ శరీరాలపైనా ఎక్స్ పోజింగ్ పైనే ఎక్కువ నమ్మకంతో ఉన్నారు. ఇంతకుముందు నేను 'మర్డర్' మూవీ చేసినప్పుడు అలాంటి రంగు చూపిస్తే ఏడుపు కనిపించింది. ప్రజలు ముద్దు సన్నివేశాల గురించి బికినీ గురించి రకరకాలుగా చెప్పారు. గెహ్రాయాన్ లో దీపికా పదుకొనే చేసింది 15 ఏళ్ల క్రితం నేను చేశాను.. కానీ అప్పట్లో చాలా సంకుచితంగా ఉండేవారు.. మీడియాతో పాటు ఇండస్ట్రీలో ఒక వర్గం నన్ను మానసికంగా చిత్రహింసలకు గురిచేసింది. వాళ్లు నా బాడీ గురించి.. గ్లామర్ గురించి మాత్రమే మాట్లాడారు.. నా నటన గురించి కాదు..! అని ఆవేదన వ్యక్తం చేశారు. నేను నా పని చేశాను.. కానీ సరిగా గుర్తించలేదు. దశావతారం- ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్ -వెల్ కమ్ చిత్రాల్లో నా నటన గురించి ఎవరూ మాట్లాడలేదు అని పాత సంగతులను మల్లిక గుర్తు చేసుకున్నారు.
నాటితో పోలిస్తే పరిశ్రమలో వచ్చిన మార్పులపై ప్రశ్నిస్తే.. మల్లిక ఆసక్తికరంగా స్పందించింది. ''ఇంతకుముందు హీరోయిన్ల కోసం రెండు రకాల పాత్రలు మాత్రమే రాసేవారు. హీరోయిన్లు చాలా పద్ధతిగా కనిపించే సతీ- సావిత్రి రకాలు.. ఏమీ తెలియని అమాయకులు లేదా నటనకు స్కోప్ లేని వాంప్ లు... కానీ ఇటీవలి కాలంలో స్త్రీలను మన దర్శకులు మనుషులుగా చూపిస్తున్నారు. ఆమె సంతోషంగా లేదా విచారంగా ఉండవచ్చు. ఆమె తప్పులు చేయొచ్చు. ఆమె తడబడగలదు.. నటిగా మెప్పించే పాత్రలను రాస్తున్నారు.. అని మలైకా వివరణ ఇచ్చారు.
మల్లికా షెరావత్ తదుపరి RK/RKay విడుదల కోసం వేచిచూస్తోంది. ఇందులో రజత్ కపూర్- కుబ్రా సైత్- రణవీర్ షోరే - మను రిషి చద్దా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రజత్ కపూర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూలై 22న థియేటర్లలోకి రానుంది.