Begin typing your search above and press return to search.
వివాదస్పద స్వామిని పాత్రలో మల్లిక
By: Tupaki Desk | 14 Aug 2015 10:11 AM GMTసినిమాలంటే వినోదం ఇన్నాళ్లు. ఇప్పుడు ట్రెండ్ మార్చేసింది ఫిలిం ఇండస్ట్రీ. సినిమాలంటే వివాదం అనే కొత్త నిర్వచనం చెబ్తున్నారు. మూవీ తీసేప్పుడే ఏదో ఒక వివాదం సృష్టించి మరీ ప్రచారం పొందుతున్నారు కొంతమంది. మరికొందరైతే మరీ ముదిరిపోయారు. ఏదన్నా సెన్సేషన్ న్యూస్ వస్తే చాలు దాన్ని సినిమాగా తీసేస్తున్నారు. లేటెస్ట్ గా దేశం మొత్తాన్ని ఓ ఊపు ఊపేసింది దొంగ సన్యాసిని రాధేమా వ్యవహారం.
పొట్టి పొట్టి డ్రస్సులేసుకుని.. విదేశీ మాల్స్ లో షాపింగ్ చేసి, ఫోటోలకు ఫోజులిస్తూ అడ్డంగా దొరికిపోయింది స్వామిని. కాషాయ వస్త్రాలు వదిలేసి.. స్కిన్ షో చేస్తూ ఇప్పడు జైలు పాలయ్యింది రాధేమా. ఈ మహిళా స్వామికి అనుకూలంగాను, వ్యతిరేకంగానూ ప్రదర్శనలు బోలెడు జరుగుతున్నాయి. ఈ అంశం ఓ బాలీవుడ్ ప్రొడ్యూసర్ కి విపరీతంగా నచ్చేసింది. ఒకవైపు భక్తి, మరోవైపు రక్తి.. రెండింటినీ పండించి మూవీ తీసేయాలనే ఆలోచన వచ్చింది.
అంతే ఈ పాత్రకి సూటయ్యే నటిగా... గ్లామర్ కి గ్రామర్ నేర్పించే మల్లికను సెలక్ట్ చేసుకున్నారు. నేహా ధూపియా కూడా ఈ మూవీలో నటించనుందట. ఏమైనా ఇలాంటి వివాదాస్పద కాన్సెప్టులతో సినిమాలు తీసి ఫ్రీగా ప్రచారం కొట్టేయచ్చని బాలీవుడ్ కి నేర్పించింది మాత్రం మన రామ్ గోపాల్ వర్మేనండీ. ఇప్పుడాయన స్లో అయినా.. చూపించిన రూట్ మాత్రం బాగా సెట్ అయింది సినిమా ఇండస్ట్రీలో.