Begin typing your search above and press return to search.
అక్కడ తిప్పి కొట్టినా.. ఇక్కడ హిట్ కొట్టాడు
By: Tupaki Desk | 22 Feb 2016 5:30 PM GMTగత వారం విడుదలైన సినిమాల్లో ఆది పినిశెట్టి నటించిన గరం కూడా ఒకటి. భారీగా ప్రచారం చేసి, బాగానే రిలీజ్ చేశారు ఆది అండ్ టీం. నిజానికి ఈ మూవీ తమిళంలో గతేడాది జూన్ లోనే 'యగవరాయినం నా కాక్క' పేరుతో విడుదలైంది. అక్కడ పెద్ద పాజిటివ్ రిజల్ట్ కూడా రాలేదు. మొదటి వీకెండ్ మంచి కలెక్షన్స్ వచ్చినా.. తర్వాత మొత్తం డ్రాప్ అయిపోయాయి. అందుకే ఓ 12 సినిమాల వెర్షన్ ను కట్ చేసి మరీ.. ప్రదర్శించారు. ఇలా ఫ్లాప్ అనిపించుకున్న సినిమాని ఆరు నెలల తర్వాత తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేయాలనే ఆలోచన చేసి, సక్సెస్ అయ్యాడు ఆది పినిశెట్టి.
ఫిబ్రవరి 19న సునీల్ కృష్ణాష్టమికి పోటీగా విడుదలైన ఆది పినిశెట్టి 'మలుపు' చిత్రానికి మౌత్ టాక్ బాగానే ఉంది. టాలీవుడ్ లో థ్రిల్లర్, హారర్ సినిమాల సీజన్ నడుస్తుండడంతో.. ఆది పినిశెట్టి థ్రిల్లర్ కి ప్రేక్షకుల ఆదరణ కూడా ఎక్కువగానే ఉంది. తమిళంలో చేసిన మిస్టేక్స్ ని కొన్నిటిని సరిచేసుకుంటూ.. ఇక్కడ విడుదల చేయడం కలిసొచ్చే విషయం.
పదిహేనేళ్ల క్రితం 2000 న్యూఇయర్ సందర్భంగా జరిగిన ఓ యదార్ధ సంఘటనల ఆధారంగా చేసుకుని రాసుకున్న రియల్ స్టోరీ అంటూ చేసిన ప్రచారం కూడా తెలుగులో కలిసొచ్చింది. ఇక సంజన చెల్లెలు నిక్క గల్రానీ గ్లామర్ ఆడియన్స్ కి అడిషనల్ బోనస్. ఈ ఎలిమెంట్స్ కారణంగా.. వీకెండ్సే కాదు, తర్వాత కూడా థియేటర్స్ లో జనాలు బాగానే కనిపిస్తున్నారు. ఇలా తమిళ్ లో ఓ ఫ్లాప్ సినిమాని తీసుకొచ్చి, సరైన పబ్లిసిటీ చేసుకుని తెలుగులో హిట్ కొట్టచ్చంటూ ప్రూవ్ చేశాడు ఆది పినిశెట్టి. ఇప్పుడీ ఫార్ములాని ఎంతమంది ఫాలో అయిపోతారో చూడాలి.