Begin typing your search above and press return to search.

నేల టికెట్ భామ తిరిగి వచ్చేసింది

By:  Tupaki Desk   |   11 March 2018 9:56 AM GMT
నేల టికెట్ భామ తిరిగి వచ్చేసింది
X
మాస్ మహారాజ రవితేజ హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న నేల టికెట్ హీరొయిన్ మాళవిక శర్మ గాయపడిన సంగతి కొద్ది రోజుల క్రితం బాగా వైరల్ అయ్యింది. అది ఈ సినిమా సెట్ లోనే జరిగిందని ఒకసారి కాదు బాలీవుడ్ మూవీ షూటింగ్ లో అని మరొకసారి రకరకాల వార్తలు ప్రచారం అయ్యాయి. అది యూనిట్ ఖండించింది కాని మాళవిక గాయంతో ఉన్న ఫోటోలు లీక్ కావడంతో దాని గురించి ఎక్కడ మాట్లాడలేదు. తాజాగా తను నేల టికెట్ టీం తో జాయిన్ అయిపోయింది. ఇంకా టైం పడుతుంది అనుకుంటే ఇంత త్వరగా రావడం చూసి రవితేజతో పాటు కళ్యాణ్ కృష్ణ కూడా షాక్ అయ్యారట. బాలీవుడ్ మోడల్స్ సాధారణంగా చిన్న గాయన్నే పెద్ద సాకుగా చూపి వాయిదాల మీద వాయిదాలు వేసే ట్రెండ్ లో మాళవిక శర్మ ఇలా సిన్సియర్ గా రావడం విశేషమే.

తెలుగులో డెబ్యు మూవీగా మాళవిక దీన్ని ఛాలెంజ్ గా తీసుకుంది. హిట్ అయితే మాత్రం ఇక్కడ అవకాశాలకు కొదవ ఉండదు. పైగా కళ్యాణ్ కృష్ణ ట్రాక్ రికార్డు బాగుంది. సోగ్గాడే చిన్ని నాయన నాగ్ కెరీర్ లోనే పెద్ద హిట్ గా నిలవగా రారండోయ్ వేడుక చూద్దాం చైతుకి మంచి విజయం అందించింది. ఈ నేపధ్యంలో రవితేజ ఎనర్జీ కి కళ్యాణ్ కృష్ణ ఎంటర్ టైన్మెంట్ తోడైతే ఎలా ఉంటుందా అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టచ్ చేసి చూడు దెబ్బ తిన్నా అంతకు ముందు వచ్చిన రాజ ది గ్రేట్ పుణ్యమా అని మాస్ రాజా సినిమా బాగుంటే తన మార్కెట్ ఎక్కడికి పోదని ఋజువు చేసింది. సో నేల టికెట్ హిట్ కావడం అందరికి అవసరమే. టైటిల్ అఫీషియల్ గా ప్రకటించనప్పటికీ చాంబర్ లో రిజిస్టర్ అవ్వడంతో పాటు క్యాచీగా ఉంది కనక ఇదే ఫిక్స్ కావడంలో పెద్దగా అనుమానం అక్కర్లేదు.