Begin typing your search above and press return to search.
గాయాన్ని ఎందుకు దాచి పెట్టారు
By: Tupaki Desk | 4 March 2018 5:53 AM GMTసినిమా షూటింగ్స్ లో ప్రమాదాలు జరగడం సహజం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒకోసారి మన కంట్రోల్ లో లేకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి. వాటికి హీరో చిన్నా పెద్దా అనే తేడాలు ఉండవు. అమితాబ్ అంతటి వాడికే కూలి షూటింగ్ లో యాక్సిడెంట్ జరిగి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతే దేశం మొత్తం అభిమానులు పూజలు జరిపిన సంఘటన ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. గౌతమీపుత్ర శాతకర్ణి షూటింగ్ లో అయిన గాయానికి బాలకృష్ణ ఈ మధ్య శస్త్ర చికిత్స చేయించుకుని ఫోటోలు కూడా షేర్ చేసుకున్నారు. అభిమానులకు ఎప్పటికప్పుడు ఇలాంటి సమాచారం ఇవ్వడం చాలా అవసరం. ఇటీవలే రవితేజ నేల టికెట్(ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా షూట్ జరుగుతున్నప్పుడు హీరొయిన్ మాళవిక శర్మ ఒకసారి రవి తేజ ఒకసారి ప్రమాదాల బారిన పడినట్టు రకరకాల వార్తలు బయటికి వచ్చాయి. కాని వాటిని నేల టికెట్ టీం ఖండిస్తూ వచ్చింది. ఎవరికి ఏం కాలేదంటూ ప్రత్యేకంగా ప్రెస్ నోట్ కూడా ఇచ్చింది.
ఇప్పుడు పైన ఫోటో చూపిస్తే ఏమంటారో వాళ్లనే అడగాలి. మాళవిక శర్మ గాయాల పాలైంది అనేది సుస్పష్టం. ఎడమ కాలి పాదం పైన చాలా స్పష్టంగా కట్టు కట్టిన నల్లని బ్యాండేజ్ తనకు ఏం జరిగిందో చెప్పకనే చెబుతోంది. వీల్ చైర్ లో తిరిగే దాకా వచ్చింది అంటే ప్రమాదం చిన్నది మాత్రం కాదు. కాకపోతే తీవ్రత స్థాయి తక్కువగా ఉండటం మాత్రం మాళవిక శర్మ నవ్వులో గమనించవచ్చు. ఎంత లేదన్నా కనీసం మూడు వారాల నుంచి నెల రోజుల దాకా రెస్ట్ అవసరం అయ్యేలా ఉంది. ఈ లోపి మాళవిక లేని సీన్స్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. రవితేజ కు అయిన గాయం గురించి మాత్రం ఇంకా అప్ డేట్ తెలియాల్సి ఉంది.
ఇక్కడ అందరికి కలిగిన సందేహం ఒకటే. గాయం అయినప్పుడు అది జరిగింది అని చెప్పుకోవడంలో తప్పేముందని. పైగా అసలు ఏం జరగనేలేదు అనేలా మీడియాకు చెప్పడం కూడా సరికాదు. దాచి పెట్టడం వల్ల షూటింగ్ అయితే నిర్విరామంగా జరగదు కదా. బ్రేక్ వేయాల్సిందే. మాళవిక శర్మతో ఇలా పాటలు తీయలేరు కదా. ఇలాంటి లాజిక్స్ మిస్ అయినప్పుడు ఫోటోలలో ఇలా దొరికేస్తారు.