Begin typing your search above and press return to search.

రవితేజ హీరోయిన్ సూపరంతే

By:  Tupaki Desk   |   26 Jun 2018 4:21 AM GMT
రవితేజ హీరోయిన్ సూపరంతే
X
బోలెడంత అందం... చూపు తిప్పుకోలేని ఫిగర్.. తెరపై ఆరబోయడానికి కావలసినంత గ్లామర్ ఉన్న భామ మాళవిక శర్మ. మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ నేలటిక్కెట్టు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఫస్ట్ ఛాన్స్ కాస్త పెద్ద సినిమాలో రావడంతో అమ్మడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది. కానీ సినిమాలో సత్తా లేకపోవడంతో నేల టిక్కెట్టు డిజాస్టర్ గా మిగిలిపోయింది.

ఎంతో వెలుగులోకి వస్తానని ఆశపడ్డా అది కాస్తా తుస్సుమనడంతో మాళవిక శర్మ తనలోని టాలెంట్ ను బయటపెట్టడానికి కొత్త మార్గం వెతికిపట్టుకుంది. రవితేజ హీరోయిన్ గా వచ్చిన గుర్తింపుతో తన సెక్సీనెస్ అంతా చూపిస్తూ పోల్ డ్యాన్స్ చేస్తూ ఓ చిన్న వీడియో చేసింది. పొట్టి నిక్కర్.. బ్లాక్ టాప్ తో వయ్యారమంతా ఒలకబోస్తూ పోల్ చుట్టూ ఈ భామ తిరుగుతూ ఉంటే చూపంతా అక్కడే నిలిచిపోతుంది. వెండితెరపై ఏ రేంజిలో గ్లామర్ లో ఒలకబోయగలదో అనే విషయాన్ని మాళవిక శర్మ ఈ ఒక్క వీడియోలోనే చెప్పేసింది.

ఈ అందాల భామ బ్యూటీ సీక్రెట్ కూడా పోల్ డ్యాన్సేనంట. ఫిట్ నెస్ కాపాడుకోవడానికి రోజూ చేసే వర్కవుట్లతోపాటు గ్యారంటీగా పోల్ డ్యాన్స్ కూడా చేస్తానని చెబుతోందీ సెక్సీ భామ. రోజు మొత్తం జాలీగా గడవడానికి పోల్ డ్యాన్స్ ప్రాక్టీస్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతోంది. నెక్ట్స్ సినిమాలో ఈ భామ హీరోయిన్ గా సెలక్ట్ అయితే అమ్మడితో ఓ పోల్ డ్యాన్స్ పాట పెట్టేయొచ్చు.