Begin typing your search above and press return to search.

రవితేజ హీరోయిన్ రియల్ లైఫ్ లోనూ అంతే

By:  Tupaki Desk   |   22 May 2018 4:48 AM GMT
రవితేజ హీరోయిన్ రియల్ లైఫ్ లోనూ అంతే
X
కొత్త హీరోయిన్లకు వెల్ కం చెప్పడానికి సిద్ధంగా ఉండే టాలీవుడ్ లో తన లక్ చెక్ చేసుకోవడానికి ఇంకో నార్త్ బ్యూటీ రెడీ అయిపోయింది. సాధారణంగా రొమాంటిక్.. లవ్ స్టోరీల కోసం ఫ్రెష్ లుక్ కోసం కొత్త హీరోయిన్లను ఎంపిక చేసుకుంటారు. కానీ నేల టిక్కెట్ డైరెక్టర్ కురసాల కళ్యాణ్ కృష్ణ మాత్రం ఊర మాస్ ఎంటర్ టెయినర్ సినిమాతో కొత్త హీరోయిన్ మాళవిక శర్మను టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నాడు.

మాళవిక మాస్ మహారాజా హీరోగా నటిస్తున్న నేల టిక్కెట్ సినిమాలో మాళవిక శర్మ మెడికోగా నటిస్తోంది. ఈ సినిమాలో మాళవిక అబ్బాయిలను కూడా అదరగొట్టేంత గడుసైన భామగా నటిస్తోంది. తాను నిజ జీవితంలో టామ్ బాయ్ లాగే ఉంటానని.. అందుకే ఈ ఛాన్స్ తనను వరించిందని అంటోంది మాళవిక. ఈ రోల్ తనకు అంత తేలిగ్గా రాలేదని చెబుతోంది. ‘‘ఈ సినిమా ఆఢిషన్ కు వచ్చేపాటికి నాకు తెలుగు ఏ మాత్రం రాదు. అంతా కొత్త . తెలుగు డైలాగ్స్ చేతిలో పెట్టి చెప్పమన్నారు. అయినా కూడా ఆ మాటలకు అర్ధం తెలుసుకుని కరెక్ట్ గా చెప్పడంతో నన్ను ఈ సినిమా కోసం సెలక్ట్ చేసుకున్నారు’’ అంటూ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం వెనుక బ్యాక్ గ్రౌండ్ ఏమిటో చెప్పుకొచ్చింది.

నేల టిక్కెట్ లో తన హీరో రవితేజ ఎనర్జిటిక్ లెవెల్స్ తనను చాలా ఇంప్రెస్ చేశాయంటోంది మాళవిక. అతడి ఎనర్జీ లెవెల్ కు మ్యాచ్ అయ్యేలా నటించడం అంటే ఓ రకంగా ఛాలెంజ్ అనేసింది. లా చదువుతూ సినిమాల్లోకి అడుగు పెట్టిన ఈ భామ రవితేజ ఎనర్జీ లెవెల్స్ ను ఏ మేరకు అందుకుందో చూడాలి.