Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: ఇది కేరళ సమురాయ్ ల కథ

By:  Tupaki Desk   |   5 Oct 2019 11:56 AM GMT
టీజర్ టాక్: ఇది కేరళ సమురాయ్ ల కథ
X
మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన 'మామాంగం' టీజర్ ఈమధ్యనే విడుదలయింది. మామాంగం అనేది కేరళలోని మలబార్ ప్రాంతంలో జరిగే ఒక పండగ. దీనికి ఎంతో హిస్టరీ ఉంది. ఈ సినిమా 1695 లో జరిగిన ఒక పీరియడ్ ఫిలిం. ఒకటిన్నర నిముషం టీజర్ లో సినిమాకు సంబంధించిన కథను రివీల్ చేయలేదు కానీ నేపథ్యం మాత్రం చూపించారు.

"ఒకసారి చూస్తే మరువలేని దృశ్యం.. జగమెరుగని ఏకైక ఘట్టం.. కళ్ళు విప్పార్చుకుని చూడండి మామాంగ మహోత్సవం" అంటూ ఒక వ్యక్తి విదేశీయులకు ఆ వేడుక గురించి గొప్పగా ఇంట్రో ఇవ్వడంతో టీజర్ ఓపెన్ అవుతుంది. ఉన్ని ముకుందన్ ఓ చిన్న బాబుకు "మన సంప్రదాయం బానిసలా బతుకుతూ చావడం కాదు.. చావరు లా వీర మరణం పొందడం" అంటూ ఉపదేశం ఇస్తాడు. కేరళలో 'చావరు'లు యుద్ధ విద్యల్లో ఆరితేరిన వీరులు. జపాన్ సమురాయ్ ల టైపు అనుకోండి. 280 ఏళ్ళ పాటు సాగిన యుద్ధానికి చివరి అంకం మొదలైందని చెప్తారు. ఈ యుద్ధంలో 12 సంవత్సరాల వయసున్న బాబు చరిత్రనే మార్చాడని ఒక స్లైడ్ ద్వారా వెల్లడించారు. ఆ బాబు నమ్మశక్యం కాని రీతిలో ఒక ఆయుధంతో శత్రువులపై విరుచుకుపడుతూ ఉంటాడు. ఇక ఫైనల్ గా మమ్ముట్టి ఎంట్రీ ఇస్తారు. ఒక గాలిలో ఎగురుతూ ఒక వ్యక్తిపై నుంచి వచ్చి మరో వ్యక్తికి గుండెల్లో కత్తిని దించుతాడు.

టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించే విధంగానే ఉంది. ఎం. పద్మకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మమాంగం' మలయాళంతో పాటుగా తెలుగు.. తమిళ.. హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఉన్ని ముకుందన్.. ప్రాచి తెహ్లాన్.. అచ్యుతన్.. సిద్దిక్.. తరుణ్ అరోరాలు ఇతర కీలక పాత్రల్లో నటించారు. నవంబర్ 21 న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.