Begin typing your search above and press return to search.
10 ఏళ్ల తరువాత తెలుగు తెరకి వస్తున్నందుకు ఎగ్జైటింగ్ గా ఉంది!
By: Tupaki Desk | 1 Nov 2021 7:37 AM GMTమమతా మోహన్ దాస్ మలయాళ సినిమాలతో తన కెరియర్ ను మొదలుపెట్టింది. ఆ తరువాత రాజమౌళి 'యమదొంగ' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది. ఆ సినిమాలో వయ్యారాలు పోతూ ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. తొలి సినిమాతోనే ఆమె భారీ విజయాన్ని అందుకుంది. ఆ తరువాత 'కింగ్' .. 'కేడి' .. 'చింతకాయల రవి' వంటి సినిమాలను చేసింది. ఒకానొక సమయంలో ఆమె పూర్తిగా మలయాళం సినిమాలపైనే ఫోకస్ పెట్టేసి, తెలుగు సినిమాలను తగ్గించింది. తాజాగా ఆమె 'ఎనిమి' సినిమాలో చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాదులో జరిగింది.
ఈ వేదికపై మమతా మోహన్ దాస్ మాట్లాడుతూ .. "అందరికీ నమస్కారం .. చాలా సంవత్సరాల తరువాత తెలుగు వేదికపైకి వచ్చాను. తెలుగులో చేయక 10 సంవత్సరాలు దాటిపోవడం వలన, తెలుగు మరిచిపోయాను. తెలుగుకి సంబంధించి ఎవరితోను టచ్ లో లేకపోవడం వలన మాట్లాడలేకపోతున్నాను. కంటిన్యూగా తెలుగు మాట్లాడలేకపోతే ఏమీ అనుకోకండి. ఈ ఈవెంట్ వేదికగా నేను పునీత్ రాజ్ కుమార్ కి నివాళులు అర్పిస్తున్నాను.
నేను సినిమాల్లోకి రావడానికిముందు నుంచి పునీత్ రాజ్ కుమార్ నాకు బాగా తెలుసు. అంటే చదువుకునే రోజుల నుంచి మా మధ్య మంచి ఇంటరాక్షన్ ఉండేది. ఆయన లేకపోవడమనేది ఇండస్ట్రీకి పెద్ద లాస్. వండర్ఫుల్ యాక్టర్. ఇన్నేళ్ల నా కెరియర్లో నేను గమనించాను .. ఆయనపై ఎలాంటి రిమార్క్ లేదు. ఈ స్టేజ్ ద్వారా ఆయనకి నివాళులు అర్పించే అవకాశం దొరికింది. ఇక 'ఎనిమి' సినిమా విషయానికి వస్తే, ముందుగా దర్శకుడు ఆనంద్ శంకర్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఈ కథను రాసుకుంటున్నప్పుడు ఈ పాత్రలో నేను కనిపించినందుకు .. ఈ పాత్రను నేనైతే బాగా చేస్తానని అనిపించినందుకు .. నాకు అవకాశం ఇచ్చినందుకు. ఈ సినిమాలో నా పాత్ర చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది. నేను తెలుగులో చేసి 10 ఏళ్లు దాటిపోవడం వలన చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఈ సినిమా తెలుగులో విడుదలవుతుందని గానీ .. ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందని గాని నేను ఊహించలేదు. సెకండ్ వేవ్ తరువాత నేను పాల్గొన్న ఫస్టు ఈవెంట్ ఇదే. తెలుగు ఆడియన్స్ ముందుకు రావడానికి నిజంగా చాలా సంతోషంగా ఉంది. దీపావళి కానుకగా ఈ సినిమా థియేటర్లకు వస్తోంది .. ఫ్యామిలీతో వెళ్లి చూడండి" అని చెప్పుకొచ్చింది.