Begin typing your search above and press return to search.

అసలు ఇంటర్యూ ఇవ్వలేదంటున్న మమత

By:  Tupaki Desk   |   23 Jan 2016 5:30 AM GMT
అసలు ఇంటర్యూ ఇవ్వలేదంటున్న మమత
X
మళయాళీ భామ మమతా మోహన్ టాలీవుడ్ లో కూడా మంచి పేరే సంపాదించుకుంది. స్టార్ హీరోల సరసన కూడా వరుసగా సినిమాలు చేసి, స్టార్ స్టేటస్ కి దగ్గరైంది కూడా. ప్లేబ్యాక్ సింగర్ కూడా కావడంతో.. ఈ భామకు బాగానే ఆఫర్స్ వచ్చాయి. అయితే, హీరోయిన్ గా ఓ రేంజ్ లో ఉండగానే.. ఈమె క్యాన్సర్ బారిన పడ్డంతో కెరీర్ గాడి తప్పింది. రెండు సార్లు క్యాన్సర్ అటాక్ చేసినా తట్టుకుని నిలబడి, ఎంతో నిబ్బరంగా ఉంది మమతా మోహన్ దాస్.

ఇంతగా కోలుకున్న ఆమె మనోధైర్యాన్ని అందరూ ప్రశంసించారు కూడా. ఇప్పటికే మల్లూవుడ్ లో రీ ఎంట్రీ కూడా ఇచ్చేసింది. టు కంట్రీస్ అనే మూవీలో నటించి సూపర్ హిట్ కూడా కొట్టేసింది మమత. ఇప్పుడీమెకు బాగా కోపం వచ్చింది. కారణం.. ఆమె పేరుపై ఓ ఆన్ లైన్ పోర్టల్ లో ప్రచురితమైన ఓ ఇంటర్వ్యూ. మమతా చెప్పిందన్నట్లుగా కొన్ని కామెంట్స్ అందులో వచ్చాయి. 'నేను నా జీవితం అయిపోయిందని అనుకున్నాను, భగవంతుడిని బతికించమని ప్రార్ధించాను', 'ప్రెజిత్ తో పెళ్లి తర్వాత చాలా సార్లు గొడవలు అయ్యాయి', 'టు కంట్రీస్ మూవీని దిలీప్ నా కోసమే వాయిదా వేసుకున్నాడు', 'జీవితంలో మరో పెళ్లి ఉంటే దాన్ని తప్పకుండా ఇష్టంగా ఆహ్వానిస్తాను', 'దేశంలో కేన్సర్ చికిత్సకు అమ్మడువుతున్న మందులన్నీ నకిలీవే'.. ఇవీ మమత చేసిందన్నట్లుగా ప్రింట్ అయిన కామెంట్స్.

దీనిపై ఈమెకు బాగా కోపం వచ్చి, తను ఎలాంటి ఇంటర్వ్యూ ఇవ్వలేదని, ఇలాంటి కల్పించి రాసినదే అంటూ తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేసింది. మీ మేగజైన్స్ అమ్ముకోవడానికి ఏదైనా రాసేస్తారా అంటూ గట్టిగా క్లాస్ పీకింది కూడా.