Begin typing your search above and press return to search.

మెగాస్టార్‌ బిర్యానీ టేస్ట్‌ చేసిన స్టార్‌ కపుల్‌

By:  Tupaki Desk   |   10 Nov 2022 6:32 AM GMT
మెగాస్టార్‌ బిర్యానీ టేస్ట్‌ చేసిన స్టార్‌ కపుల్‌
X
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టీ తాను ఏ సినిమా షూటింగ్‌ లో పాల్గొన్నా కూడా చిత్ర యూనిట్‌ సభ్యుల్లో దాదాపు అందరికి కూడా లంచ్ ను స్వయంగా ఏర్పాటు చేయిస్తూ ఉంటాడు అంటూ మళయాల సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. తాజాగా ఆయన నటిస్తున్న ఒక సినిమా షూటింగ్‌ సెట్‌ కు వచ్చిన స్టార్ కపుల్‌ సూర్య, జ్యోతికలకు కూడా తన బిర్యానీ రుచి చూపించాడు.

మమ్ముట్టీ ప్రస్తుతం కాథల్‌ : ది కోర్ అనే సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులంలో షూటింగ్‌ జరుగుతుంది.

ఆ షూటింగ్ కార్యక్రమాలు జరుగుతున్న సమయంలోనే సెట్స్ కి తమిళ స్టార్‌ హీరో సూర్య మరియు ఆయన భార్య జ్యోతికలు వెళ్లారు. అనుకోకుండా వచ్చిన గెస్ట్‌ లకు మలయాళ మెగాస్టార్ తన సాంప్రదాయ పద్దతిని కంటిన్యూ చేశాడు.

స్వయంగా తన చేతితో వండిన బిర్యానీ ని సూర్య మరియు జ్యోతికలకు వడ్డింపజేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మమ్ముట్టీ ఫ్యాన్స్ అందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో తెగ షేర్‌ చేస్తున్నారు. పెద్ద ఎత్తున మమ్ముటీ ఫ్యాన్స్ తో పాటు సూర్య అభిమానులు ఈ వీడియోను షేర్‌ చేసుకుంటున్నారు.

సూర్య మరియు జ్యోతిక లు ఎందుకు కాథల్‌ : ది కోర్ సినిమా సెట్స్ కు వెళ్లారు అనే విషయంలో అటు కేరళ మీడియా కానీ ఇటు తమిళ మీడియా కానీ క్లారిటీ ఇవ్వడం లేదు. ఏం జరుగుతుందో అనే విషయం తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్‌ చేయాలి.

ఇక సూర్య తో పాటు జ్యోతిక కూడా వరుసగా సినిమాలు చేస్తూ ఉంది. ఇటీవలే జాతీయ అవార్డులను వీరిద్దరు దక్కించుకున్నారు. సూర్య ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు ను సొంతం చేసుకుంటే జ్యోతిక ఉత్తమ నిర్మాతగా ఆకాశమే నీ హద్దురా సినిమాకు గాను జాతీయ అవార్డును సొంతం చేసుకోవడం జరిగింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.