Begin typing your search above and press return to search.
ఫ్యాన్స్ ప్రవర్తనకు మెగాస్టార్ క్షమాపణలు
By: Tupaki Desk | 11 Aug 2019 10:16 AM GMT`రంగస్థలం` చిత్రానికి.. అందులో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన హీరో రామ్ చరణ్ కి అన్యాయం జరిగిందంటూ జాతీయ అవార్డుల జూరీపై మెగా ఫ్యాన్స్ విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరోల్ని మాత్రమే పట్టించుకుని ప్రాంతీయ హీరోల్ని వదిలేస్తారా? అంటూ సీరియస్ అయ్యారు. చెవులు వినిపించని చిట్టిబాబుగా చరణ్ నటన అంతగా ఆకట్టుకోలేదా? ఆయుష్మాన్ .. విక్కీ కౌశల్ మాత్రమే నచ్చారా? అంటూ అభిమానులు సీరియస్ అయ్యారు.
అయితే ఇదే తరహాలో అటు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అభిమానులు అంతే సీరియస్ అయ్యారు. మమ్ముట్టి కి జాతీయ అవార్డుల్లో అన్యాయం జరిగిందన్నది అభిమానుల వాదన. ఆయన నటించిన తమిళ చిత్రం `పేరంబు`లో అత్యుత్తమ నటన కనబరిచారు. కానీ జాతీయ అవార్డుల జూరీకి కనిపించలేదా? అంటూ నిలదీస్తూ నేరుగా జూరీ సభ్యుడైన రాహుల్ రావైల్ ని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఫేస్ బుక్ లో హేట్ మెసేజ్ లు పెడుతూ అసంబద్ధమైన భాషలో తిట్టేస్తున్నారు. `మామంగం` చిత్రంలోనూ ఆయన నటనకు గుర్తింపు దక్కలేదని విమర్శిస్తున్నారు.
అయితే ఫ్యాన్స్ ప్రవర్తనతో తీవ్ర కలతకు గురైన రాహుల్ రావైల్ వెంటనే మమ్ముట్టికి ఒక సందేశాన్ని పంపారు. పేరంబు చిత్రం ప్రాంతీయ జూరీ ప్యానెల్ వద్దనే తిరస్కారానికి గురైంది. అసలు సెంట్రల్ ప్యానెల్ కి రానేలేదు. అయినా జూరీ నిర్ణయాన్ని ఎవరికీ ప్రశ్నించే హక్కు లేదన్న సంగతి మీకు తెలియదా? అని ప్రశ్నించారు. దానికి వెంటనే స్పందించిన మమ్ముట్టి ఫ్యాన్స్ ప్రవర్తనకు క్షమాపణలు కోరారు. జరిగిన ఘటన తనకు తెలీదు అని అన్నారు. మొత్తానికి అభిమానుల తప్పిదానికి మెగాస్టార్ ఇలా స్వయంగా సారీ చెప్పాల్సొచ్చింది.