Begin typing your search above and press return to search.
వైయస్ 'ఆత్మ' ను పట్టుకోవాలని ట్రై చేశా!- మమ్ముట్టి
By: Tupaki Desk | 1 Feb 2019 11:42 AM GMTమాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలో కీలక ఘట్టాల ఆధారంగా `యాత్ర` తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఓ తెలుగు హీరోని ఎంపిక చేసుకోకుండా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ని మహి.వి.రాఘవ్ టీమ్ ఎంచుకున్నారు. దాదాపు పాతికేళ్ల తర్వాత మమ్ముట్టి ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఫిబ్రవరి 8న ఈ సినిమా రిలీజవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో పాత్రికేయులతో మమ్ముట్టి మాట్లాడారు.
ఈ సినిమాకి ఓకే చెప్పడానికి కారణమేంటి? అన్న ప్రశ్నకు... ఒక లెజెండరీ నాయకుడి కథ .. ఆలస్యం కాకుండా నిర్మించే సత్తా ఉన్న నిర్మాత.. దర్శకుడు వినిపించిన కథ.. ఈ మూడు అంశాలే కారణమని మమ్ముట్టి తెలిపారు. పూర్తి బౌండ్ స్క్రిప్టుతో దర్శకనిర్మాతలు నన్ను కలిశారు. యాత్ర కథను చెప్పారు. వైయస్సార్ `యాత్ర`లో మహిళలు - విద్యార్థులు - రైతులు - సామాన్య ప్రజలు… ఇలా అందరినీ కలిశారు. ఇలా ఆయన ఎవరెవరిని కలిశారు? వాళ్ల సమస్యలను పరిష్కరించడానికి ఏమేం చేశారు? అనేదే సినిమా కథాంశం. కథ వినగానే అంగీకరించాను.. అని తెలిపారు.
ఈ సినిమాలో నటించడానికి భాష పరమైన సమస్య తలెత్తిందా? అన్న ప్రశ్నకు .. అలాంటిదేమీ లేదని తెలుగు- మలయాళంలో ఒకే తరహా పదాలు ఉన్నాయని అందువల్ల తన పని చాలా సులువైందని తెలిపారు. తెలుగు తనకు అర్థమవుతుందని అన్నారు. ఈ సినిమా కోసం వైయస్ జగన్ ని ఎప్పుడూ కలవలేదని అన్నారు. వైయస్సార్ బాడీ లాంగ్వేజ్ ని కాపీ కొట్టలేదని.. ఆయనలా అస్సలు ప్రయత్నించలేదని .. ఆయనలా నడవడం.. మాట్లాడడం కష్టమని అన్నారు. అయితే వైయస్సార్ ఆత్మను పట్టుకునేందుకు ప్రయత్నించానని తెలిపారు. వైయస్సార్ లా ఉండాలని ప్రయత్నించినా సక్సెస్ కాలేమని అందుకే తన పద్ధతిలోనే నటించానని అన్నారు. సరైన పాత్ర, కథ కుదిరితే తెలుగులో మరిన్ని చిత్రాలు చేస్తానని మమ్ముట్టి ఈ సందర్భంగా తెలిపారు.