Begin typing your search above and press return to search.
'వన్' ట్రైలర్: 'ఆహా' లో మెగాస్టార్ పొలిటికల్ థ్రిల్లర్..!
By: Tupaki Desk | 27 July 2021 10:01 AM GMTమాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ''వన్''. మలయాళంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని 'ఆహా' ఓటీటీ తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్న తెలుగు డిజిటల్ వేదిక 'ఆహా'.. ఈ చిత్రాన్ని అదే పేరుతో జూలై 30న స్ట్రీమింగ్ పెడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా 'వన్' చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు.
ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లో అడుగుపెట్టిన ఒక సాధారణ వ్యక్తి.. ముఖ్యమంత్రిగా ఎలా ఎదిగాడు? ఈ క్రమంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు?, సీఎంగా అతనికి ఎదురైన రాజకీయ సవాళ్ళు ఏంటి? ప్రతిపక్షాలతోనే కాకుండా సొంత పార్టీ కుట్రలను ఎలా తట్టుకుని నిలబడ్డాడు? అనే కథాంశంతో ''వన్'' సినిమా తెరకెక్కింది. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి కల్లూరి చంద్రమ్ పాత్రలో మమ్ముట్టి నటించారు.
'వన్' చిత్రంలో ముఖ్యమంత్రిగా మమ్ముట్టి గెటప్.. ఆయన హావభావాలు.. పలికిన డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. 'గవర్నమెంట్ ని విమర్శించడానికి దారులు వెతుక్కోవడం.. లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేయాలని చూడటం.. ఇవే నేటి రాజకీయాల్లో ప్రతిపక్షాలు పోషిస్తున్న పాత్రలు' 'నేను ఈ 15 లక్షల మందికి మాత్రమే ముఖ్యమంత్రిని కాదు.. తెలంగాణలో ఉన్న మూడున్నర కోట్ల మందికి ముఖ్యమంత్రిని' అంటూ మమ్ముట్టి చెప్పే డైలాగ్స్ అలరిస్తున్నాయి.
ఇందులో మురళీ గోపి - జగదీష్ - అలెన్సియర్ లే లోపేజ్ - నిమిషా సజయన్ - జోజు జార్జ్ - సుధీర్ కరమణ వంటి టాలెంటెడ్ నటీనటులు ఇతర కీలక పాత్రలు పోషించారు. సంతోష్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బాబీ - సంజయ్ లు స్టోరీ అందించారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం సమకూర్చారు. వైడీ సోమ సుందరమ్ సినిమాటోగ్రఫీ అందించగా.. నిషాద్ యూసఫ్ ఎడిటింగ్ చేశారు. ఇచ్చాయిస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆర్. శ్రీలక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మించారు. పొలిటికల్ డ్రామాలను ఇష్టపడే వారు ఈ నెల 30 నుండి 'ఆహా' లో ''వన్'' చిత్రాన్ని వీక్షించవచ్చు.