Begin typing your search above and press return to search.

`కాస్టింగ్ కౌచ్‌`పై మ‌మ‌త సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు!

By:  Tupaki Desk   |   20 July 2018 1:54 PM GMT
`కాస్టింగ్ కౌచ్‌`పై మ‌మ‌త  సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు!
X
హాలీవుడ్ లో హార్వీ వీన్ స్టీన్ ఉదంతంతో క్యాస్టింగ్ కౌచ్ పై పెను దుమారం రేగిన సంగ‌తి తెలిసిందే. హాలీవుడ్ లో మొద‌లైన # మీ టూ ఉద్యమం నుంచి....టాలీవుడ్ లో శ్రీ‌రెడ్డి అర్ధ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న వ‌ర‌కు క్యాస్టింగ్ కౌచ్ లోని భిన్న పార్శ్వాల‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేశాయి. ప్ర‌త్యేకించి శ్రీ‌రెడ్డి ఉదంతం త‌ర్వాత‌..చాలామంది టాలీవుడ్ - కోలీవుడ్ - బాలీవుడ్ న‌టీమ‌ణులు - హీరోయిన్లు కూడా క్యాస్టింగ్ కౌచ్ పై త‌మ అభిప్రాయాల‌ను - చేదు అనుభ‌వాల‌ను వెల్ల‌డించేందుకు ముందుకు వ‌స్తున్నారు. దాదాపుగా అన్ని సినీ ఇండ‌స్ట్రీలు...ఆ మాట‌కొస్తే దాదాపుగా మహిళ‌లు ప‌నిచేసే ప్ర‌తిచోటా...`కాస్టింగ్‌ కౌచ్‌` వ్య‌వ‌హారం ఏదో ఒక రూపంలో వేళ్లూనుకొని పోయింది. ఈ నేప‌థ్యంలోనే చాలామంది సెల‌బ్రిటీలు కూడా ఈ వ్య‌వ‌హారం గురించి బ‌హిరంగంగా మాట్లాడుతున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా, హీరోయిన్ మ‌మ‌తా మోహ‌న్‌ దాస్ ...క్యాస్టింగ్ కౌచ్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఒక మ‌హిళతో వేరే వ్య‌క్తి అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్నాడంటే....అందులో ఆమె ప్ర‌మేయం కూడా ఎంతో కొంత ఉంటుంద‌ని మ‌మ‌త షాకింగ్ కామెంట్స్ చేసింది.

తాజాగా, ఓ ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా మ‌మ‌త సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. క్యాస్టింగ్ కౌచ్ లో కొద్దో గొప్పో మ‌హిళ‌ల ప్ర‌మేయం కూడా ఉంటుంద‌ని మ‌మ‌త చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. అందమైన అమ్మాయిల‌కే ఈ త‌ర‌హా స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా ఎదుర‌వుతుంటాయని మ‌మ‌త చెప్పింది. అందంగా లేని యువ‌తులు సంతోషంగానే ఉంటారని - అందంగా ఉన్న అమ్మాయి స‌మాజంలో ధైర్యంగా బ‌త‌క‌డం క‌ష్టమ‌ని మ‌మ‌త చెప్పింది. ఒక మ‌హిళ‌తో పురుషుడు అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తే.....అందుకు ఆమే ప్రేరేపించి ఉంటుంద‌ని మ‌మ‌త‌ అభిప్రాయ‌ప‌డింది. అయితే, అంద‌రి విష‌యాల్లోనూ ఇలాగే జ‌ర‌గాల‌ని లేద‌ని - హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించే కొంద‌రు మ‌హిళ‌లకు మాత్ర‌మే ఇది వ‌ర్తిస్తుంద‌ని చెప్పింది. పురుషులు చేసే చిన్న చిన్న కామెంట్ల‌కు అతిగా స్పందించ‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని చెప్పింది. తాజాగా, మ‌మ‌త చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఓ మహిళ అయిన మ‌మ‌త ఇత‌ర మ‌హిళ‌ల గురించి చుల‌క‌న‌గా మాట్లాడ‌డం పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. బ‌ల‌వంతంగా బెదిరించి లైంగిక వేధింపులు - రేప్ ల‌కు పాల్ప‌డే వారి గురించి మ‌మ‌త ఎందుకు మాట్లాడ‌లేద‌ని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు.