Begin typing your search above and press return to search.

అమ్మడు బొత్తాలు విప్పితే.. మతులు పోవాల్సిందే!

By:  Tupaki Desk   |   17 May 2020 3:30 AM GMT
అమ్మడు బొత్తాలు విప్పితే.. మతులు పోవాల్సిందే!
X
'ఓలమ్మీ తిక్కరేగిందా..' అనే పాటకు జూనియర్ ఎన్టీఆర్ సరసన చిందులేసిన చిన్నది గుర్తుందా.. యాక్టింగ్ తో పాటు మంచి సింగర్ గా కూడా పేరు తెచ్చుకుంది. టాలీవుడ్ ఆమె పాడిన ఫస్ట్ సాంగ్ 'రాఖీ రాఖీ రాఖీ.. నా కవసాకీ' అంటూ రాఖీ సినిమాకోసం తన గళం వినిపించింది. ఆ తర్వాత కుర్రకారు ఆకలి తీర్చడానికి 'ఆకలేస్తే అన్నం పెడతా..' అని పాడి బుజ్జగించింది కూడా.. ఇంతకీ ఆ గుంట ఎవరా.. అని ఆలోచిస్తున్నారా.. ఆ బ్యూటీనే మమతా మోహన్ దాస్. తెలుగులో 'యమదొంగ - చింతకాయల రవి - కేడి సినిమాలలో నటించిన ఈ భామకు యమదొంగ తప్ప ఏ సినిమా తగిన గుర్తింపు తీసుకురాలేదు. ఇక మధ్య మధ్యలో స్పెషల్ అప్పీయరెన్సుగా కొన్ని సినిమాల్లో మెరిసింది. 2009లో చేసిన కేడి సినిమా తర్వాత మళ్లీ ఇన్ని సంవత్సరాలు తెలుగులో కనిపించలేదు. ఈ అందమైన బ్యూటీ లైఫ్ లో భారమైన సంఘటనలు చాలానే ఉన్నాయట. అందులో ఒకటి క్యాన్సర్. ఆ మహమ్మారితో కొంతకాలం పోరాడి జయించి మళ్లీ సినిమాల వైపు మళ్లింది. కానీ ఈసారి తెలుగు కాదు తమిళ - మలయాళం సినిమాల వైపు అడుగేసింది.

ఇక తమిళ అంతంత మాత్రం అయినా మలయాళంలో మాత్రం అమ్మడికి మంచి హిట్ సినిమాలే పడ్డాయి. కాన్సర్ జయించింది కాబట్టి మమతను ఆమె అభిమానులు 'బ్యూటీ విత్ స్ట్రాంగ్ హార్ట్' అంటూ పిల్చుకుంటారు. ప్రస్తుతం మలయాళం ఇండస్ట్రీలో సింగర్‌గా కూడా రాణిస్తోంది.. ఈ కేరళకుట్టి. కేడి సినిమా తర్వాత తనకి బాల్య స్నేహితుడైన ప్రజీత్ ను వివాహం చేసుకుని తెలుగు సినిమాలకి మరింత దూరమైంది. ఇక లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయిన మమత.. సోషల్ మీడియాలో కైపెక్కించే చూపులతో కుర్రకారు ప్రేక్షకులను రెచ్చగొడుతూ పోస్టులు పెడుతోంది. కొన్ని సినిమాలలో తనదైన శైలిలో అందాల ఆరబోత చేసిన మమత.. గాయనిగా కూడా తన టాలెంట్ ని ప్రేక్షకులకి రుచి చూపించింది. తాజాగా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో అమ్మడి అందాలు చూస్తే అసలు ఈమె మమతేనా అనే డౌట్ తప్పకుండా వస్తుంది. ఎందుకంటే అంత గ్లామరస్ గా తయారయ్యింది మరి. వైట్ షర్ట్ జీన్స్ ప్యాంటులో.. బొత్తాలు విప్పిన ఎద అందాలు చూస్తే మతిపోతుంది.. మీరు కూడా ఓ లుక్కేయండి!