Begin typing your search above and press return to search.

య‌మ‌దొంగ బ్యూటీ ఈజ్ బ్యాక్ ఎగైన్

By:  Tupaki Desk   |   4 Jan 2022 11:30 PM GMT
య‌మ‌దొంగ బ్యూటీ ఈజ్ బ్యాక్ ఎగైన్
X
క‌థానాయిక‌గా గాయ‌నిగా స‌త్తా చాటిన మ‌మ‌తా మోహ‌న్ దాస్ ఇటీవ‌లి కాలంలో టాలీవుడ్ స‌ర్కిల్స్ నుంచి మిస్స‌యిన సంగ‌తి తెలిసిందే. క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారీ త‌న జీవితాన్నే మార్చేసింది. కానీ ఎంత క‌ష్టాన్ని అయినా మ‌నోధైర్యంతో ఎదుర్కొని క్యాన్స‌ర్ ని జ‌యించి ఇప్పుడు రీఫ్రెషింగ్ లుక్ తో తిరిగి సినీకెరీర్ ని కొన‌సాగిస్తుండ‌డం ఎంద‌రికో స్ఫూర్తి అని చెప్పాలి. గాయ‌నిగా కెరీర్ ప్రారంభించి NTR యమదొంగ చిత్రంతో టాలీవుడ్ లో క‌థానాయిక‌గా తెరంగేట్రం చేసిన‌ ఈ మలయాళ బ్యూటీ అటుపై కేడీ- కింగ్‌ లాంటి చిత్రాల్లో నాగార్జున స‌ర‌స‌న న‌టించింది. ఓవైపు గాయ‌నిగా.. మ‌రోవైపు క‌థానాయిక‌గా కెరీర్ ని కొన‌సాగించింది. అయితే లైఫ్ లో ఊహించని ఓ కుదుపు ఈ అమ్మ‌డి ఆశ‌ల్ని అడియాశ‌లు చేసింద‌నే చెప్పాలి. కెరీర్ స్పీడ్ అందుకుంటున్న స‌మ‌యంలో ప్ర‌మాద‌క‌ర‌ క్యాన్సర్ బ‌య‌ట‌ప‌డింది. ఇది ఊహించ‌ని కుదుపు.

క్యాన్స‌ర్ కి చికిత్స అనంత‌రం కొంతకాలం సినిమాలకు దూరమై మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించినా ఆశించినంత స్పీడ్ గా రేస్ లో దూసుకెళ్లలేక‌పోయింది. అప్ప‌ట్లోనే మీటూ ఉద్య‌మం నేప‌థ్యంలో ఓ సంచ‌ల‌న వ్యాఖ్య‌తో మ‌మ‌తా హాట్ టాపిక్ అయ్యింది. `` అందంగా ఉండి రెచ్చగొట్టేలా ప్రవర్తించడమే మహిళలపై అఘాయిత్యాలు జరగడానికి కారణం!!`` అంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య చేయ‌డంతో దానిపై సామాజిక మాధ్య‌మాల్లో వాడి వేడిగా చ‌ర్చ సాగింది. అందంగా ఉన్న అమ్మాయిలు ఈ సొసైటీలో ధైర్యంగా బ్రతకడం కష్టం. లైంగిక వేధింపుల‌కు కార‌ణం అమ్మాయిల‌ ప్ర‌వ‌ర్త‌నే అని అన‌డంతో అది కాస్తా మ‌హిళామ‌ణుల ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది. ఆ త‌ర్వాత ఏమైందో మ‌మ‌త మ‌ళ్లీ మీడియాకి ట‌చ్ లో లేదు. ఇక అంద‌రు క‌థానాయిక‌ల్లానే మ‌మ‌తా సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కు ట‌చ్ లో ఉంది. లేటెస్టుగా ఓ ఫోటోషూట్ ని షేర్ చేసింది. అల్ట్రా మోడ్ర‌న్ డిజైన‌ర్ లుక్ తో 36ఏజ్ మ‌మ‌త ఇచ్చిన ఫోజులు ప్ర‌స్తుతం యువ‌త‌రంలో వైర‌ల్ గా మారాయి.

మ‌మ‌తా ఇప్పుడు తిరిగి గ్లామ‌ర‌స్ డాళ్ గా మారింది. ఒంపు సొంపుల రూప‌లావ‌ణ్యాన్ని తిరిగి తెచ్చుకుంది. అందుకు ఇదిగో ఈ ఫోటోనే సాక్ష్యం. ఈ ప్ర‌య‌త్నం చూస్తుంటే మ‌రోసారి టాలీవుడ్ స‌హా సౌత్ లో అవ‌కాశాల కోసం ట్ర‌య‌ల్స్ లో ఉంద‌నే అర్థ‌మ‌వుతోంది. ఇంకా 40లోపే అంటే చిన్న వ‌య‌సే ఇంకా. ఏజ్ బార్ కాలేదు. అందుకే ఈసారైనా టాలీవుడ్ ఛాన్స్ వ‌స్తుందేమో చూడాలి.

మాతృభాష‌లో ఫుల్ బిజీ..

కార‌ణం ఏదైనా ప్ర‌స్తుతం మ‌మ‌త తెలుగు చిత్ర‌సీమ‌కు దూరంగా ఉన్నారు. కానీ త‌న మాతృభాష మ‌ల‌యాళంలో ఏకంగా అర‌డ‌జ‌ను సినిమాలు చేస్తూ బిజీగా ఉండ‌డం ఆశ్చ‌ర్యప‌రుస్తోంది. 2020-22 సీజ‌న్ లో మ‌మ‌తా మోహ‌న్ దాస్ డైరీ లో కాల్షీట్ అన్న‌దే లేదంటే అర్థం చేసుకోవాలి. ఫోరెన్సిక్.. లాల్ బాగ్- రామ‌సేతు- బిలాల్ - మ్యావ్- బ్ర‌మ‌రం-ఎనిమీ-జూత‌న్-అపోస్థ‌ల‌న్ అనే మ‌ల‌యాళ చిత్రాల్లో న‌టిస్తున్న మ‌మ‌తా `ఊమై` అనే త‌మిళ చిత్రంలోనూ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇంత‌కుముందు ఓ సినిమా షూటింగ్ కోసం వెళ్లి అక్క‌డి నుంచి లైవ్ లీగా మోటార్ రైడింగ్ చేస్తూ ప్ర‌త్య‌క్ష‌మైంది. హ్యార్లీ డేవిడ్ స‌న్ బైక్ పై అలా ర‌య్ ర‌య్ మంటూ దూసుకుపోతున్న మ‌మతా మోహ‌న్ దాస్ ఎంతో స్టైలిష్ గా పోష్ లుక్ తో క‌నిపించిన సంగ‌తి తెలిసిందే.