Begin typing your search above and press return to search.
అరుంధతిగా నటించనందుకు బాధపడుతున్నా
By: Tupaki Desk | 10 Feb 2018 11:30 PM GMTమమతా మోహన్ దాస్... తన నటనతోనే కాదు, పాటలతోనూ ప్రేక్షకులను అలరించింది. యమదొంగ, చింతకాయల రవి, కింగ్ సినిమాల్లో నటించి మెప్పించింది. యమదొంగలో ఆమె చేసిన ఓలమ్మీ తిక్క రేగిందా పాటకు డ్యాన్సు మాస్ అభిమానుల ఈలలు వేయించింది. చాలా కొంచెం సినిమాలు చేశాక తెలుగులో కనిపించకుండా వెళ్లిపోయింది. లేటెస్టుగా మనకు ఇంతవరకు తెలియని విషయాన్ని షేర్ చేసుకుంది.
అనుష్క అంతెత్తున కూర్చోబెట్టిన సినిమా అరుంధతి. ఆ సినిమా తరువాత అనుష్క ఫేట్ మారిపోయింది. స్టార్ హీరోయిన్ అయిపోయింది. అసలు లేడీ ఓరియంటెడ్ సినిమా అనగానే అనుష్క గుర్తొచ్చేలా చేసింది. అంతేనా ఆ సంవత్సరం విడుదలైన సినిమాలలో ఎక్కువ వసూలు చేసిన సినిమాగానూ మారింది. అలాంటి సినిమా మొదట వెళ్లింది మమతా మోహన్ దాస్ దగ్గరికేనట. అయితే కెరీర్ విషయంలో నటించాలా? వద్దా అనే సందేహంలో ఆ సినిమాను వద్దని చెప్పేసిందట మమతా. ఇంకేముంది అవకాశాన్ని అందిపుచ్చుకుని స్టార్ హీరోలకు పోటీగా ఎదిగింది అనుష్క. ఆ విషయంలో ఇప్పటికీ పశ్చాత్తాపడతానంటోంది మమతా. ఒకవేళ మమతా ఆ సినిమా చేసుంటే... అనుష్క ఎక్కడుండేది? మమతా ఎక్కడుండేది? అని చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
ప్రస్తుతం మమతా మలయాళ ఇండస్ట్రీపైనే దృష్టి సారించింది. తెలుగువైపు రావడం లేదు. మమతా వ్యక్తిగత జీవితంలోనూ చాలా ఒడిదొడుకులు వచ్చాయి. పెళ్లి చేసుకున్న ఏడాదికే భర్తతో విడిపోయింది. ఈ లోపు క్యాన్సర్ కూడా ఎటాక్ చేసింది. ధైర్యంగా క్యాన్సర్ పోరాడింది. లాస్ ఏంజలస్ లో క్యాన్సర్ కు ట్రీట్ మెంట్ తీసుకుంది.