Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: గుండుతో పోజిచ్చిన మల్లు బ్యూటీ

By:  Tupaki Desk   |   5 Feb 2019 6:53 AM GMT
ఫోటో స్టొరీ: గుండుతో పోజిచ్చిన మల్లు బ్యూటీ
X
క్యాన్సర్ అంటే గతంలో జనాలు చాలా భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు కాలం మారుతోంది. మెరుగైన వైద్యం అందుబాటులోకి రావడంతో పాటుగా ప్రజలు కూడా ఈ సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడిన కొంతమంది సెలబ్రిటీలు ధైర్యంగా ఆ సమస్యను ఎదుర్కొని క్యాన్సర్ ను జయించారు. యువరాజ్ సింగ్ లాంటి స్టార్ క్రికెటర్లతో పాటుగా మనిషా కొయిరాలా.. సోనాలి బెంద్రే లాంటివారు క్యాన్సర్ తో ధైర్యంగా పోరాడారు. సోనాలి బెంద్రే అయితే క్యాన్సర్ సోకిందని తెలిసినప్పటి నుంచి ట్రీట్మెంట్ పూర్తయ్యే వరకూ తన ఎమోషన్స్ ను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఇతరలుకు ధైర్యం ఇచ్చేలా ప్రేరణగా నిలిచింది.

ఈ రోజు వరల్డ్ క్యాన్సర్ డే. ఈ సందర్భంగా మరో హీరోయిన్ మమతా మోహన్ దాస్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక కంపారిజన్ ఫోటో పోస్ట్ చేసింది. పదేళ్ళ క్రితం క్యాన్సర్ ట్రీట్ మెంట్లో భాగంగా గుండు చేయించుకున్నప్పటి ఫోటోతో పాటుగా లేటెస్ట్ ఫోటో ఒకదానిని పోస్ట్ చేసి "గుండు అందరి కళ్ళను మీవైపు తిప్పేలా చేస్తుంది" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఎన్టీఆర్ 'యమదొంగ'.. నాగార్జున 'కేడి' లాంటి సినిమాలలో మమత హీరోయిన్ గా నటించింది. 'కేడీ' షూటింగ్ జరుగుతున్న సమయంలోనే క్యాన్సర్ అని తెలియడంతో ట్రీట్ మెంట్ మొదలు పెట్టాల్సి వచ్చింది. అప్పుడు మమత కొన్ని షెడ్యూల్స్ విగ్ తో నటించిందని సమాచారం.

ఈ ఫోటోకు రెండు సందర్భాలు కలిసివచ్చాయి. ఒకటి వరల్డ్ క్యాన్సర్ డే కాగా రెండోది #10 ఇయర్స్ ఛాలెంజ్. పదేళ్ళ క్రితం గుండులో ఉన్న మమతా ఇప్పుడు మళ్ళీ లాంగ్ హెయిర్ తో నార్మల్ గా ఉంది. కానీ రెండు ఫోటోలలో కొట్టొచ్చినట్టు కన్పించే అంశం ఏంటంటే ఆమె నవ్వు.. దాని వెనకున్న ఆత్మవిశ్వాసం. ఈ ఫోటోతో పాటు ఒక పెద్ద ఎమోషనల్ మెసేజ్ కూడా పెట్టింది మమత. క్యాన్సర్ పై పోరాటంలో తనకు సపోర్ట్ నిలిచిన అమ్మనాన్నలు.. ఇతర కుటుంబ సభ్యులు.. స్నేహితులు.. శ్రేయోభిలాషులు.. అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.