Begin typing your search above and press return to search.
షూటింగ్ స్పాట్ లో వ్యక్తి ఆత్మహత్యయత్నం
By: Tupaki Desk | 18 Sep 2019 1:29 PM GMTముంబయిలో హాలీవుడ్ మూవీ 'టెనెట్' షూటింగ్ జరుపుతున్నారు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాబర్ట్ పాటిసన్ హీరోగా నటిస్తున్నాడు. ముంబయిలో 10 రోజుల చిత్రీకరణ కోసం వచ్చిన టెనెట్ యూనిట్ సభ్యులు పలు ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్నారు. ముంబయిలోని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద చిత్రీకరణ జరిపేందుకు టెనెట్ యూనిట్ సభ్యులు ఏర్పాట్లు చేస్తుండగా ఒక వ్యక్తి పక్కనే ఉన్న సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు.
ముంబయిలోని కాజ్ వే మార్కెట్ లో చిత్రీకరణ పూర్తి చేసుకుని మద్యాహ్నంకు గేట్ వే ఆఫ్ ఇండియా వద్దకు చేరుకున్నారు. సిబ్బంది అంతా కూడా షూటింగ్ హడావుడిలో ఉన్నారు. షూటింగ్ నిమిత్తం తాజ్ హోటల్ ముందు సముద్రంలో 40 పడవలు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఒక వ్యక్తి నీటిలో దూకడంను యూనిట్ సభ్యులు గుర్తించారు. వెంటనే ఆ వ్యక్తిని కాపాడేందుకు లైఫ్ గార్డ్ లు నీటిలో దూకారు. కాని అప్పటికే అతడు లోనిక వెళ్లి పోయాడు. దాంతో అతడికి తాడును విసిరి బయటకు వచ్చేందుకు సాయం చేశారు.
సెట్ డిజైన్ చేసే వారు అతడిని కాపాడారు అంటూ ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పుకొచ్చారు. నీటిలో దూకిన వ్యక్తిని పోలీసులు వచ్చి తీసుకు వెళ్లారు. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉందని మరో చిత్ర యూనిట్ సభ్యుడు మీడియాతో చెప్పుకొచ్చాడు. ఈ సంఘటనతో కొద్ది సమయం షూటింగ్ కు అంతరాయం కలిగినా ఆ తర్వాత మళ్లీ యదావిధిగా షూటింగ్ ను కొనసాగించినట్లుగా టెనెట్ యూనిట్ సభ్యులు చెప్పారు.