Begin typing your search above and press return to search.
రాంగ్ రూట్లో వచ్చాడు..అడిగితే వేలు కొరికేశాడు
By: Tupaki Desk | 26 Feb 2019 4:54 AM GMTట్రాఫిక్ లో చిక్కుకుపోవటం.. అష్టకష్టాలు పడటం హైదరాబాద్ మహానగరంలో నివసించే ప్రతిఒక్కరికి అనుభవమే. నిత్యం ఒకట్రెండుసార్లు అయినా ట్రాఫిక్ చికాకులతో కానీ రోజు గడవని దుస్థితి. ఈ సందర్భంగా గొడవలు.. తిట్టుకోవటాలు.. కొన్ని సందర్భాల్లో శృతిమించి కొట్టుకోవటాల వరకూ వెళుతుంటాయి. తాజా ఉదంతం కూడా అలాంటిదే. మల్కాజ్ గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఉదంతం షాకింగ్ గా మారింది.
రాంగ్ రూట్లో వచ్చిన కారు డ్రైవర్ ను కారును కాస్త పక్కకు పెట్టాలన్న మాట చేదు అనుభవాన్ని మిగిల్చింది. మౌలాలి హనుమాన్ నగర్ కు చెందిన మహ్మద్ జాఫర్ పెయింటర్ గా పని చేస్తుంటాడు. బైక్ మీద లాలాపేట్ వెళుతున్నాడు. మౌలాలి కమాన్ ఎదురుగా ఇండికా కారు వచ్చింది. రాంగ్ రూట్లో వచ్చిన అయ్యగారి పుణ్యమా అని ట్రాఫిక్ జాం ఏర్పడింది.
దీంతో.. కారును కాస్త పక్కకు తీస్తే వెళతానంటూ జాఫర్ కోరాడు. అంతే.. కారు డ్రైవర్ మహ్మద్ అలీకి కోపం వచ్చేసింది. నోటికి వచ్చినట్లుగా తిట్టేయటమేకాదు.. జాఫర్ మీద దాడి చేశాడు. ఈ క్రమంలో అతడి వేలును బలంగా కొరికేశాడు. ఎంతలా అంటే.. వేలు ఊడి కింద పడిపోయిన పరిస్థితి.
ఊహించని రీతిలో చోటు చేసుకున్న ఈ పరిణామంతో షాక్ తిన్న జాఫర్.. తెగి కిందపడిన వేలును తీసుకొని ఆసుపత్రికి పరుగులు తీశాడు. అతడికి వైద్యులు చికిత్స చేశారు. అనంతరం మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అలీని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కోర్టు అతడ్ని రిమాండ్ కు పంపుతూ ఆదేశాలు జారీ చేసింది. కాస్తంత ఓపిక.. మరికాస్త సహనం మిస్ అయితే ఎంత ఇబ్బందో ఈ ఉదంతం చెబుతుందని చెప్పాలి.