Begin typing your search above and press return to search.

కబాలి చూడాలా? పెళ్లి చేస్కోవాలా?

By:  Tupaki Desk   |   22 July 2016 11:39 AM GMT
కబాలి చూడాలా? పెళ్లి చేస్కోవాలా?
X
సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ కబాలి ఇప్పటికే చాలా సంచలనాలు నమోదు చేసింది. మరిన్ని సెన్సేషన్స్ క్యూలో ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ రిలీజ్ డేట్ కావడంతో.. అభిమానులంతా థియేటర్ల దగ్గర పడిగాపులు పడిపోతున్నారు. కబాలి గురించి ఏ ఒక్కటయినా కొత్త మాట ఎవరినుంచైనా వినిపించకపోతుందా అని ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

మరోవైపు కబాలి గురించి రజినీకాంత్ గురించి ఇప్పటికే చాలామంది చాలా రకాల జోక్స్ పేల్చుతున్నారు. వీటన్నిటి మధ్య ఓ ట్వీట్ మాత్రం అమితమైన ఆసక్తి కలిగించింది. అదేంటంటే.. 'మా ఫ్రెండ్ ఒకడు ఇవాళ కబాలి రిలీజ్ కదా అని విపరీతమైన ఎగ్జైట్ మెంట్ తో సినిమా టికెట్స్ కొనేశాడు. ఇంతకీ వాడు మర్చిపోయిన విషయం ఏంటంటే.. ఇవాళ వాడు పెళ్లి చేసుకోవాలి. అటు మహూర్తం టైమ్.. ఇటు సినిమా టైమ్ రెండూ ఒకటే. ' అంటూ రాసుకొచ్చాడు.

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. 'ఇలాంటి టైమ్ లో ఎవరైనా పెళ్లి చేసుకోవడంపై ఇంట్రెస్ట్ చూపిస్తారా' అంటూ ఆ జోక్ తనే ఫినిషింగ్ ఇచ్చేయడం. ఇది వాస్తవమో.. జోక్ చేశాడో చెప్పలేం కానీ.. పేలడం అయితే.. కబాలి రేంజ్ లో పేలింది.