Begin typing your search above and press return to search.
రామాయణంలో సస్పెన్స్ ఏంటి రాజా!
By: Tupaki Desk | 8 Sept 2016 10:56 AM ISTవెర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ తనే దర్శకత్వం వహిస్తూ నటించిన మూవీ మన వూరి రామాయణం. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాకి రీసెంట్ గా ఓ టీజర్ విడుదల చేశారు. పక్కా పల్లెటూరి నేపథ్యంతో.. ఎంతో అందమైన లొకేషన్లతో.. విభిన్నమైన హావభావాలతో ఆ టీజర్ ఆకట్టుకుంది. కానీ ఇప్పుడీ సినిమాకి రెండో టీజర్ విడుదల చేశారు. దీనిలో సస్పెన్స్ ఎలిమెంట్స్ ని గుప్పించడం ఆశ్చర్యం కలిగించింది.
మనవూరి రామాయణం మొదటి టీజర్ చివర్లో ఒకే సన్నివేశంలో కనిపించిన ప్రియమణిని.. ప్రకాష్ రాజ్ కిడ్నాప్ చేసి కట్టి పడేస్తాడు. అందులో బాగా మంచివాడిగా ఉన్న ప్రకాష్ రాజ్.. ఈ టీజర్ కి వచ్చేసరికి.. చెడ్డవాడిగా మారిపోయాడు. చిమ్మ చీకట్లో ప్రియమణిని కట్టి పడేయగా.. ఆమె దగ్గరకు వస్తూ ఉంటాడు ప్రకాష్ రాజ్. భయపడి దూరం జరిగేందుకు ఈ హీరోయిన్ ప్రయత్నిస్తూ ఉంటుంది.
తొలి టీజర్ లో సాఫ్ట్ యాంగిల్ అయినా.. ఈ టీజర్ లో థ్రిల్లర్ యాంగిల్ అయినా.. వీటిలో ఆకట్టుకునే అసలు విషయం ఇళయరాజా సంగీతం. చెవులకు ఇంపుగానే కాదు.. క్యూరియాసిటీ జనరేట్ చేసేలా ఉన్న మాస్ట్రో మ్యూజిక్ మనవూరి రామాయణం చిత్రానికి అదనపు ఆకర్షణ అని చెప్పాల్సిందే. ఇక దసరా కానుకగా అక్టోబర్ 7న ఈ మూవీ రిలీజ్ చేయనున్నాడు దర్శకుడు ప్రకాష్ రాజ్.