Begin typing your search above and press return to search.

మేనేజర్ అవుట్.. అమ్మగారు ఇన్!

By:  Tupaki Desk   |   4 Jun 2019 6:13 AM GMT
మేనేజర్ అవుట్.. అమ్మగారు ఇన్!
X
హీరోయిన్లకు మేనేజర్లు చాలా ముఖ్యం. ఎందుకంటే సినిమా ఆఫర్లను డీల్ చేయడమే కాదు ఇతరత్రా ఆదాయమార్గాలైన యాడ్స్.. షోరూమ్ ఓపెనింగ్స్ లాంటివి అన్ని దాదాపుగా మాట్లాడేది వారే. అంతే కాదు హీరోయిన్లకు సరైన రెమ్యూనరేషన్ ఇప్పించడం కూడా వారి టాలెంట్ పైనే ఆధారపడి ఉంటుంది. మేనేజర్లు సరైనవాళ్ళైతే హీరోయిన్లకు లాభం... స్మార్ట్ గా ఉండకపోతే మాత్రం చాలా నష్టం. తాజాగా ఒక టాలీవుడ్ భామకు మేనేజర్ పనితీరు ఏమాత్రం నచ్చలేదట. దీంతో ఆయనను తొలగించిందట.

ఆ హీరోయిన్ పోయినేడాది పెద్దగా కలిసి రాలేదు కానీ ఈ ఏడాది మాత్రం మంచి హిట్ సాధించింది. అయినా ఏదో మీడియం రేంజ్ సినిమాల ఆఫర్లు తప్ప ఒక్క క్రేజీ ప్రాజెక్టు ఆఫర్ కూడా రాకపోవడంతో మేనేజర్ పనితీరు సరిగా లేదని గ్రహించిందట. దీంతో కోపం వచ్చి ఆ మేనేజర్ ను విధుల నుంచి తప్పించి తన అమ్మకే ఆ బాధ్యతలను అప్పజెప్పిందట. హీరోయిన్ అమ్మగారు సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత చేతిలోకి ఓ కొత్త ప్రాజెక్టు వచ్చిందని.. ఆమె తన టాలెంట్ తో బేరమాడి తన కూతురుకి ఎక్కువ రెమ్యూనరేషనే ఇప్పించుకుందని టాక్. ఇక ఆ హీరోయిన్ చేత మాతృ భాషలో కూడా ఒక సినిమాను సైన్ చేయించిందట. అక్కడ డబ్బు ఎక్కువగా రాదు కానీ గుర్తింపు మాత్రం ఎక్కువే ఉంటుందట. అందుకే హీరోయిన్ అమ్మగారు అలా ప్లాన్ చేసిందట.

సినిమా హీరోయిన్లకు ఇలా అమ్మలు మేనేజర్ల బాధ్యతలు నిర్వహిస్తూ తమా కూతురు వేళకు తింటోందా లేదా అని చూస్తూ ఉండడం కొత్తేమీ కాదు. అయితే అందరూ ఈ విషయంలో సక్సెస్ కాలేదు. అమ్మలు కనుక కూతురి కెరీర్ లో ఎక్కువగా జోక్యం చేసుకున్నప్పుడు ఒక్కోసారి వారి కెరీర్ లు కూడా దెబ్బతిన్నాయి. మరి ఈ హీరోయిన్ కెరీర్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.