Begin typing your search above and press return to search.

ఈ మేనేజర్ల గోల ఏంటండీ బాబూ!!

By:  Tupaki Desk   |   31 May 2016 10:30 PM GMT
ఈ మేనేజర్ల గోల ఏంటండీ బాబూ!!
X
చిన్న చిన్న హీరోయిన్లు.. కనీసం చిన్న చిన్న సినిమాలైనా చేసుకోవచ్చు కదా అనే ఓ సందేహం చాలామంది సినిమా లవ్వర్లకు ఉంటుంది. కేవలం ఒక్క సినిమా చేసి.. ఇక్కడ కాస్త ఫేస్‌ వాల్యూ పెంచుకున్నాక.. ఆ భామలకు అవకాశాలు లేకుండా పోతాయ్‌. ఒక ప్రక్కన వాళ్ళు సబ్జెక్టు నచ్చితే ఫ్రీగా చేస్తాం అని చెబుతుంటారు కాని.. అలాంటివి కూడా వర్కవుట్ కావు. ఎందుకంటారు?

దానికి 85% కారణం సదరు చిన్న చిన్న భామలు మెయిన్టయిన్‌ చేస్తున్న మేనేజర్లు అనే చెప్పాలి. సాధారణంగా ఏదైనా ఒక సినిమా ఈ మేనేజర్‌ ద్వారా చేస్తే.. వీరికి ఒక 20% కమీషన్‌ వస్తుంది. ఒకవేళ ఎవరైనా సినిమావారు 2 లక్షల ఆఫర్‌ చేస్తాం అంటే.. ఆ భామలు ఒప్పుకున్నా కూడా ఈ మేనేజర్లు ఒప్పుకోనివ్వరు. ఎందుకంటే వీరికొచ్చేది పెద్దగా ఏముండదు అందులో. ఒకవేళ ఏమన్నా 10 లక్షల రేంజులో ఉంటే వీళ్లకు ఒక 2 లక్షల వరకు వర్కవుట్ అవుతుంది కమీషన్‌. అందుకే హీరోయిన్‌ ఎస్‌ చెప్పినా.. చాలామంది మేనేజర్లు మధ్యలో డ్యామేజర్లలా పనిచేసి.. ఆ భామలకు ఛాన్సులు రాకుండా.. ఇక్కడున్న చిన్న సినిమాల వారు వాళ్ళను పెట్టుకోనియకుండా పరోక్షంగా కారణమవుతుంటారు.

అసలు ఈ మేనేజర్లు లేకుండా ఒక హీరోయిన్‌ డైరెక్టుగా నిర్మాత అండ్‌ డైరక్టర్‌ తో మాట్లాడుకుంటే.. చాలా సినిమాలు చేసుకోవచ్చు. కాని అలా చేస్తే.. ఏదన్నా గొడవ వచ్చినప్పుడు మీకు మేనేజర్ లేడు కదా అంటారని వారి భయం. టాన్సపెరన్సీ లేని యవ్వారాలు ఇవన్నీ!!