Begin typing your search above and press return to search.
కమల్ అద్భుత చిత్రాల జాబితాలో ‘మనం’
By: Tupaki Desk | 14 Aug 2017 5:30 PM GMTవిలక్షణ నటుడు కమల్ హాసన్ అభిరుచి గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తన సినిమాల ఎంపిక చూస్తేనే ఆయన టేస్టేంటన్నది అర్థమవుతుంది. సినీ రంగంలో ఎంతో సాధించిన లోకనాయకుడు వేరే సినిమాల గురించి ఏ అభిప్రాయం చెప్పినా దానికి ఎంతో విలువ ఉంటుంది. ఆయన తాజాగా నాకు నచ్చిన అత్యుత్తమ చిత్రాలంటూ ఇండియన్ ఫిలిం హిస్టరీలో వచ్చిన అన్ని సినిమాల్లోంచి ఓ 70 తీసి వాటి జాబితాను ప్రకటించాడు. 1937 నుంచి మన దేశంలో వివిధ భాషల నుంచి వచ్చిన సినిమాల్లోంచి వీటిని ఎంచుకున్నారు కమల్ హాసన్. ఐతే తాను చూసిన సినిమాల్లోంచే బెస్ట మూవీస్ ను ఎంపకి చేసినట్లు ఆయన వెల్లడించారు.
ఈ జాబితాలో కొన్ని తెలుగు సినిమాలకు కూడా చోటు దక్కింది. టాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్స్ అయిన ‘మాయా బజార్’.. ‘దేవదాసు’లతో పాటు ‘సుడిగుండాలు’.. ‘మనవూరి పాండవులు’.. ‘సొమ్మొకడిది సోకొకడిది’’ సినిమాలకు ఈ జాబితాలో చోటు దక్కింది. అలాగే తాను తెలుగులో నటించిన క్లాసిక్స్ ‘మరో చరిత్ర’.. ‘సాగర సంగమం’.. ‘అమావాస్య చంద్రుడు’.. తన గురువు విశ్వనాథ్ తీసిన ‘స్వాతిముత్యం’లకు కూడా తన లిస్టులో చోటు కల్పించాడు కమల్. విశేషం ఏంటంటే.. 2000వ సంవత్సరం తర్వాత తెలుగులో వచ్చిన సినిమాల్లో కమల్ కు ఒకే ఒక్క సినిమా నచ్చిందట. అది అక్కినేని ఫ్యామిలీ స్పెషల్ ‘మనం’ కావడం విశేషం. తాను ఎంపిక చేసిన సినిమాల్లో చాలా వరకు నటుడిగా తన కెరీర్ ను కూడా ప్రభావితం చేసినట్లు కమల్ చెప్పాడు.