Begin typing your search above and press return to search.
మనం.. ఇన్సూరెన్స్ ఏమైందబ్బా?
By: Tupaki Desk | 6 Jun 2018 5:46 PM GMTఅక్కినేని కుటుంబంలో ఎవరు ఎన్ని సినిమాలు చేసినా ఎన్ని బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్నా కూడా వారికి మనం కంటే గొప్ప సినిమా మరొకటి ఉండదు. ప్రతి ఒక్కరికి ఆ సినిమా జీవితాంతం గుర్తుంటుంది. చివరగా అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆ సినిమా అంటే అక్కినేని ఫ్యామిలీకి ప్రాణం. ఆయన చివరగా నటించిన జ్ఞాపకాలు అలానే ఉండాలని మనం సెట్ ను అలానే ఉంచిన సంగతి తెలిసిందే.
అన్నపూర్ణ స్టూడియోలో మనం సినిమా కోసం భారీ సెట్ ను నిర్మించిన సంగతి తెలిసిందే. సోగ్గాడే చిన్ని నాయన సినిమా కోసం కొంచెం మార్పులు చేసి కూడా ఆ సెట్ ను వాడుకున్నాడు. అయితే కొన్ని నెలల క్రితం ఆ సెట్ ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైన సంగతి తెలిసిందే. ఎలా జరిగిందో కారణం తెలియదు గాని మొత్తానికి నాగార్జున గుర్తుగా ఉంచుకున్న జ్ఞాపకం కాలిపోయింది. అయితే ఈ సెట్ కు ముందే ఇన్సూరెన్స్ చేయించారు.
కానీ ఇప్పటివరకు ఇన్సూరెన్స్ క్లైమ్ కాలేదని టాక్ వస్తోంది. ఘటన జరిగిన నెలలు గడుస్తున్నా ఇంకా నష్టపరిహారం దక్కకపోవడం వెనుక అనుమానాలు ఏంటని రూమర్స్ వస్తున్నాయి. ఈ ఘటనకు ఎవరైనా పాల్పడ్డారా? లేక ప్రమాదవ శాత్తు జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేసిన ఇన్సూరెన్స్ కంపెనీకి క్లారిటీ రాలేదట. దీంతో ఆ కేసును పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇక నాగార్జున కూడా ఈ విషయం గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని సమాచారం.