Begin typing your search above and press return to search.
టీజర్ టాక్: మనసును తట్టే మనమంతా
By: Tupaki Desk | 25 Jun 2016 5:27 AM GMTమలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్.. మనోళ్లు ఇక్కడ అందరినీ సూపర్ స్టార్ అనేస్తారు కానీ.. మోహన్ లాల్ ని కంప్లీట్ యాక్టర్ అంటారు. అలాంటి మల్లూవుడ్ దిగ్గజ నటుడు తొలిసారిగా తెలుగుతెరపై ప్రధానపాత్రలో కనిపిస్తున్న సినిమా మనమంతా. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్ లో అంచనాలు చాలానే ఉండగా.. ఇప్పుడు వాటిని పెంచేలా మంచి అనుభూతిని మిగిలించే ఓ టీజర్ ను విడుదల చేశారు.
మహిత అనే ఓ 12 ఏళ్ల స్కూల్ గాళ్, అభిరామ్ అనే ఇంజినీరింగ్ స్టూడెంట్, గాయత్రి హౌజ్ వైఫ్.. సూపర్ మార్కెట్లో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేసే సాయిరాం.. వీరందరి జీవిత ప్రయాణాన్ని కలబోసిన చిత్రమే మనమంతా. ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని భావించే చిన్నారి.. తనను ప్రేమించిన వాళ్లకోసం ఏవైనా అమ్మేసే కుర్రాడు.. గౌరవం కావాలని కోరుకునే గృహిణిగా గౌతమి.. పొదుపుగా జీవించే మోహన్ లాల్ పాత్ర.. భలేగా ఆకట్టుకుంటాయి.
ఒకే ప్రపంచం.. నాలుగు కథలు.. ఇదీ మనమంతా ట్యాగ్ లైన్. ఈ నాలుగు పాత్రల చుట్టూ తిరిగే సినిమా ఇది. దీనికి ప్రధాన ఆకర్షణ మోహన్ లాల్. తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుని ఆశ్చర్యపరిచారు ఈ సీనియర్ స్టార్. ట్యూబ్ మార్చాలని రిపేర్ షాపు వాడు అంటే 'వచ్చే నెల మారుద్దాం.. ఈ నెలకు దాన్ని పూడ్చరా' అంటూ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. యాక్టింగ్ విషయంలో వంకలు వెతికే ఛాన్స్ ఎలాగూ ఉండదు. ఇక తెలుగులో మోహన్ లాల్ శకం ఆరంభమయినట్లే అనిపిస్తోందీ టీజర్ చూస్తుంటే.