Begin typing your search above and press return to search.
మానస్ గ్రాఫ్ డౌన్... అతి తక్కువ ఓట్లు
By: Tupaki Desk | 20 Nov 2021 11:30 AM GMTతెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లో బుల్లి తెర నటుడిగా ఎంట్రీ ఇచ్చిన మానస్ తక్కువ సమయంలోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకుని.. తన ప్రవర్తనతో ఇన్ని వారాలు కొనసాగుతూ వచ్చాడు. ఆయన మాట్లాడే విధానం మరియు తన ఆట తీరు వల్ల ప్రేక్షకులు అతడిని ఎన్ని సార్లు ఎలిమినేషన్ కు నామినేట్ అయినా కూడా ప్రేక్షకులు సేవ్ చేస్తూ వచ్చారు. అతడు ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటాడనే నమ్మకం అందరు వ్యక్తం చేశారు. కాని ఇప్పుడు అతడి గ్రాఫ్ పడిపోయినట్లుగా సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. గత రెండు వారాలుగా అతడు డల్ అయ్యాడు.. అలాగే అతడు తీసుకుంటున్న స్టాండ్ మరియు అతడి ఆట తీరు కూడా మారింది. అతడు ఇంతకు ముందులా ఉండటం లేదనిపిస్తుంది.
ముఖ్యంగా అతడు సన్నీ అభిమానులకు నచ్చడం లేదు అంటూ టాక్ వినిపిస్తుంది. ప్రియాంకా సింగ్ తో అతడి రిలేషన్ ను చాలా మంది అభిమానించారు. కాని అతడు ఇప్పుడు ప్రియాంక సింగ్ ను దూరం పెడుతూ వచ్చాడు. అందుకే అతడిని ప్రేక్షకులు దూరం పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రేక్షకులు మానస్ ను పెద్దగా పట్టించుకుంటున్నట్లుగా లేరని తాజాగా ఆయనకు దక్కిన ఓట్లను బట్టి అర్థం అవుతుందని బిగ్ బాస్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి నామినేట్ అయ్యి ఉన్న మానస్ కింది నుండి రెండు స్థానాల్లో ఉన్నట్లుగా చెబుతున్నారు.
ఎలిమినేషన్ కు కూడా చాన్స్ లేకపోలేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఆనీ మాస్టర్ ఈ వారంలో ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటూ మొదట వార్తలు వచ్చాయి. కాని ఇప్పుడు ఆనీ మాత్రమే కాకుండా మానస్ కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి. బిగ్ బాస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. వారి ఒక్క చర్య తో మొత్తం సీజన్ లో చేసిన మంచి పనులు అన్ని కూడా ప్రేక్షకులు మర్చి పోయి ప్రేక్షకులు వారిని పక్కకు పెట్టే అవకాశాలు ఉంటాయి. అందుకే బిగ్ బాస్ నుండి ఈ వారం లేదా త్వరలోనే మాస్ వెళ్లి పోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మళ్లీ మానస్ పుంజుకుంటుందా లేదా ఎలిమినేట్ అవుతాడా అనేది చూడాలి.