Begin typing your search above and press return to search.
లక్కీగా సేవ్ అయిన ఆనీ.. సూపర్ పవర్ తో సేవ్ అయిన మానస్
By: Tupaki Desk | 3 Nov 2021 5:34 AM GMTసాదారణంగా బిగ్ బాస్ లో సోమవారం ఎపిసోడ్ లో ఎలిమినేషన్ నామినేషన్ ఘట్టం పూర్తి అవ్వాల్సి ఉంటుంది. కాని ఈసారి మంగళవారం ఎపిసోడ్ లో కూడా ఆ ఘట్టం కొనసాగింది. సోమవారం ఎపిసోడ్ లో సాదారణంగా ఒకొక్కరు ఇద్దరు చొప్పున నామినేట్ చేయడం జరిగింది. నామినేషన్ పక్రియలో భాగంగా కెప్టెన్ షన్నూ తప్ప మొత్తం పది మంది కూడా ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు అంటూ బిగ్ బాస్ ప్రకటించాడు. అయితే నామినేట్ అయిన పది మందిలో ఇద్దరికి ఇమన్యూనిటీ దక్కే అవకాశం ను బిగ్ బాస్ మంగళ వారం ఎపిసోడ్ లో ఇచ్చారు. మొదటగా సేవ్ అయ్యే టాస్క్ ను చాలా ఇంట్రెస్టింగ్ గా బిగ్ బాస్ పెట్టడం జరిగింది. బ్యాగ్ లను వారి ఫొటోలను అతికించి ఉంచారు. ఆ బ్యాగ్ లు స్టోర్ రూమ్ లో ఉంటాయి. ఆ స్టోర్ రూమ్ నుండి ఎవరు అయితే బ్యాగ్ పట్టుకుని చివర్లో వస్తారో వారు డేంజర్ జోన్ లోకి వెళ్తారు. ఇక వారు ఎవరి ఫొటో ఉన్న బ్యాగ్ ను పట్టుకు వస్తారో వారు కూడా డేంజర్ జోన్ లోకి వెళ్తారు.
అలా ఇద్దరు డేంజర్ జోన్ లో ఉండగా ఇంటి సభ్యుల ఓటింగ్ తో ఆ ఇద్దరిలో ఒకరిని సేఫ్ చేయవచ్చు. అంటే ఒకరు గేమ్ నుండి తప్పుకుంటారు. అలా ఒకొక్కరు చొప్పున గేమ్ నుండి తప్పుకుంటూ చివర్లో ఎవరు మిగులుతారో వారికి ఇమ్యూనిటీ దక్కుతుంది. మొదటి రౌండ్ లో బ్యాగ్ లు పట్టుకుని అంతా కూడా పరుగులు పెట్టి సేఫ్ ఏరియాలో అడుగు పెడతారు. కాని శ్రీరామ్ చంద్ర మాత్రం సేఫ్ జోన్ వరకు వెళ్లి కూడా అందులో అడుగు పెట్టడు. కారణం అతడి చేతిలో ఉన్నది కాజల్ బ్యాగ్ కనుక. శ్రీరామ్ చేసిన పనితో కాజల్ మరియు శ్రీరామ్ లు ఇద్దరు డేంజర్ జోన్ లో పడగా ఇంటి సభ్యులు ఎక్కువ మంది శ్రీరామ్ కు ఓటు వేసి సేవ్ చేస్తారు. దాంతో కాజల్ గేమ్ నుండి తప్పుకుంటుంది.. శ్రీరామ్ మళ్లీ ఆటలో చేరతాడు. రెండవ రౌండ్ లో జెస్సీ చివరగా ఉంటాడు. అతడి చేతిలో సన్నీ బ్యాగ్ ఉంటుంది. ఇద్దరు డేంజర్ జోన్ లో ఉండగా జెస్సీకి మద్దతు లభిస్తుంది. మూడవ రౌండ్ లో మళ్లీ జెస్సీనే చివరికి వస్తాడు. అతడి చేతిలో సిరి బ్యాగ్ ఉంటుంది. ఇద్దరిలో ఇంటి సభ్యుల ఓట్లతో జెస్సీ తప్పకుంటాడు. సిరి కంటిన్యూ అవుతుంది.
నాల్గవ రౌండ్ లో శ్రీరామ్ చివరకు వచ్చి విశ్వ బ్యాగ్ ను కలిగి ఉంటాడు. ఇంటి సభ్యులు విశ్వను ఔట్ చేసి బయటకు పంపిస్తారు. అయిదవ రౌండ్ లో సిరి చివరగా రావడం.. ఆమె చేతిలో రవి బ్యాగ్ ఉంటుంది. అప్పుడు సిరి కి తక్కువ ఓట్లు దక్కి బయటకు వెళ్లి పోతుంది. ఆరవ రౌండ్ లో బ్యాగ్ లు ముడి వేసి షన్నూ గేమ్ ప్లే చేస్తాడు. దాంతో ప్రియాంక కు బ్యాగ్ దక్కదు. దాంతో ఆమె ఎలిమినేట్ అయినట్లుగా ప్రకటిస్తాడు షన్నూ. ఏడవ రౌండ్ లో మానస్ చివర్లో ఉంటాడు. అతడి చేతిలో రవి బ్యాగ్ ఉంటుంది. రవికి తక్కువ ఓట్లు పడటంతో మానస్ కంటిన్యూ అవుతాడు. చివరి రౌండ్ లో మళ్లీ మానస్ చివరకు వస్తాడు. ఆనీ మాస్టర్ బ్యాగ్ అతడి చేతిలో ఉంటుంది. ఆ సమయంలో మానస్ ను బయటకు పంపిస్తున్నట్లుగా శ్రీరామ్ చెప్తాడు. ఆ తర్వాత శ్రీరామ్ మరియు ఆనీల మద్య పోటీ ఉంటుంది. ఇద్దరిలో మెజార్టీ మద్దతు ఆనీ మాస్టర్ కు ఉంటుంది. దాంతో ఆమెకు ఇమ్యూనిటీ దక్కుతుంది.
లక్కీగా ఆనీకి ఇమ్యూనిటీ దక్కింది. అలాగే హోస్ట్ ఇచ్చిన సూపర్ పవర్ ను కూడా ఆనీ ఉపయోగించే సమయం వచ్చిందంటూ బిగ్ బాస్ ప్రకటించాడు. మొత్తం 9 మందిలో ఎవరిని మీరు సేవ్ చేస్తున్నారో చెప్పవచ్చు అంటూ బిగ్ బాస్ ప్రకటించడంతో తనకు గత వారం సేవ్ చేసిన మానస్ ను తాను ఈ వారం సేవ్ చేయాలనుకున్నట్లుగా చెప్పి మానస్ ను ఆనీ మాస్టర్ సేవ్ చేసింది. దాంతో ఈ వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ లో సన్నీ.. సిరి.. ప్రియాంక.. కాజల్.. రవి.. విశ్వ.. శ్రీరామ్..జెస్సీ లు ఉన్నారు. వీరిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అయ్యి వెళ్లి పోతారు అనేది చూడాలి.