Begin typing your search above and press return to search.
మనసంతా నువ్వే దర్శకుడు కంబ్యాక్
By: Tupaki Desk | 1 Nov 2019 10:06 AM GMT'మనసంతా నువ్వే' లాంటి క్లాసిక్ హిట్ తీశాడు వీ.ఎన్.ఆదిత్య. ఉదయ్ కిరణ్ - రీమా సేన్ జంటగా నటించిన ఈ సినిమా ప్రేమకథా చిత్రాల్లోనే మరపురాని మ్యూజికల్ హిట్ గా నిలిచింది. దర్శకుడిపై గౌరవం పెంచిన క్లాసిక్ చిత్రమిది. అయితే ఆ తర్వాత దానిని నిలబెట్టుకోవడంలో వీ.ఎన్ విఫలమయ్యారు.
రకరకాల కారణాలతో కొన్ని ఫ్లాపులు తీసి మూల్యం చెల్లించుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఫేట్ కూడా ఇంపార్టెంట్. అది తనకు కలిసి రాలేదు. అయితే ప్రస్తుతం ఈ దర్శకుడు కంబ్యాక్ అవుతున్నారా? అంటే అవుననే సమాచారం. మనసంతా నువ్వే రేంజులో అతడు మరో టైటిల్ ని ఎంచుకుని సినిమా తీస్తున్నాడు. 'వాళ్లిద్దరి మధ్యా' అనే టైటిల్ ని ఫైనల్ చేశాడు. ఈసారి తప్పనిసరిగా కంబ్యాక్ అవుతానన్న ధీమాని వ్యక్తం చేస్తున్నాడట.
క్లాసిక్ ని తీసి తర్వాత ఫ్లాపులతో డైలమాలో పడిపోయాడు. చాలా ఏళ్లుగా కంబ్యాక్ కోసం ట్రై చేస్తున్నా కానీ ఏదీ సరిగా కుదరలేదు. ఏదోలా ఇప్పటికి కుదిరింది. అయితే ఈసారైనా రాణిస్తాడా? సక్సెస్ అందుకుంటాడా? అంటూ అభిమానుల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చిన చాలా మంది దర్శకులు సక్సెస్ కాలేదు. చాలా తక్కువ మంది మాత్రమే పోరాడి నెగ్గుకొచ్చారు. మరి వీ.ఎన్ ఫేట్ ఎలా ఉంది అన్నది చూడాలి. ప్రస్తుతం అతడు పలువురు పెద్ద హీరోలకు కథలు సజెస్ట్ చేసే పనిలో కూడా పడ్డాడట. వాళ్లంతా వీ.ఎన్ కథను సెలెక్ట్ చేస్తే నటించేందుకు ఆసక్తిగానే ఉన్నారట. చూద్దాం దర్శకుడిగా అతడి ప్రయత్నం ఫలవంతమవుతుందా.. లేదా?