Begin typing your search above and press return to search.
వాళ్ల మనసులకు ఇది నచ్చట్లేదా?
By: Tupaki Desk | 15 Feb 2018 4:18 PM GMTఈ రోజుల్లో ఓవర్సీస్ మార్కెట్ అన్నది చాలా కీలకంగా మారింది. చిన్న-మీడియం రేంజి సినిమాలు కూడా మంచి కంటెంట్ ఉంటే అక్కడ మిలియన్.. రెండు మిలియన్ డాలర్ల కలెక్షన్లు కొల్లగొట్టేస్తున్నాయి. అక్కడి ప్రేక్షకుల అభిరుచుల్ని దృష్టిలో ఉంచుకుని సినిమాలు తీస్తున్నారు ఇప్పటి ఫిలిం మేకర్స్. అక్కడి తెలుగు ప్రేక్షకులు క్లాస్ లవ్ స్టోరీలకు.. ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు. థ్రిల్లర్లకు.. ప్రయోగాత్మక చిత్రాలకు పట్టం కడుతుంటారు. ఈ వారాంతంలో విడుదల కానున్న రెండు సినిమాలు ఆ కేటగిరిలోకి చేరే సినిమాలే. ‘అ’ ప్రయోగాత్మక థ్రిల్లర్ కాగా.. ‘మనసుకు నచ్చింది’ రొమాంటిక్ లవ్ స్టోరీ. ఐతే ‘అ’ సినిమా యుఎస్ ప్రేక్షకుల్ని ఓ మోస్తరుగానే ఆకర్షిస్తోంది. మొదట్నుంచి ఈ చిత్ర ప్రోమోలు డిఫరెంటుగా ఉంటూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచాయి.
ఐతే ‘మనసుకు నచ్చింది’కి మాత్రం ఆశించిన బజ్ రాలేదు. ఈ చిత్ర టీజర్.. ట్రైలర్ ఏమంత ఆకర్షణీయంగా అనిపించలేదు. అందులో కొత్తదనం ఏమీ కనిపించలేదు. సందీప్ కిషన్ వరుస ఫ్లాపుల్లో ఉండటం.. కొత్త దర్శకురాలైన మంజుల ఈ చిత్రాన్ని రూపొందించడంతో దీనికి క్రేజ్ రాలేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక యుఎస్ లోనూ ఈ సినిమాకు ప్రి రిలీజ్ బజ్ లేదు. ఈ తరహా సినిమాలకు కీలకమైన యుఎస్ మార్కెట్ లో పరిస్థితి ఆశాజనకంగా లేదు. గత వారం వచ్చిన ‘తొలి ప్రేమ’ యుఎస్ లో బాగా ఆడుతోంది. పోటీలో ఉన్న ‘అ’ సినిమాకూ క్రేజ్ ఉంది. ఈ పరిస్థితుల్లో ‘మనసుకు నచ్చింది’ ఏమేరకు జనాల్ని ప్రిమియర్లకు ఆకర్షిస్తుందో చూడాలి. అసలు ఈ సినిమాకు టాక్ ఎలా ఉంటుందన్నది కీలకం. ప్రి రిలీజ్ బజ్ లేని నేపథ్యంలో టాక్ బాలేకుంటే మాత్రం మంజులకు కష్టమే.