Begin typing your search above and press return to search.
తూ ఛీజ్ బడీ హై మస్త్ మస్త్
By: Tupaki Desk | 20 March 2015 5:32 AM GMTబాలీవుడ్‌తో పోలిస్తే టాలీవుడ్ చాలా వెనుకబడి ఉందని చెబుతోంది మిస్ ఇండియా వరల్డ్ (2010) మనస్వి మంగాయ్. బాలీవుడ్ చాలా ఓపెన్. కానీ ఇక్కడ పూర్తి డిఫరెంటుగా ఉన్నారు. ఓసారి అనుకోకుండా సల్వార్ కమీజ్‌లో కనిపించాను. నన్నెవరూ గుర్తు పట్టలేకపోయారు అని చెప్పింది.
ఇటీవలే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ సినిమా యాక్షన్ జాక్సన్ అనే చిత్రంలో నటించింది. ఆ చిత్రంలో అమ్మడి ఎక్స్‌పోజింగ్ చూసి కుర్రకారంతా పరేషాన్ అయ్యారు. అంతేకాదు.. అంత విపులంగా విప్పి చూపించిన ఈ అమ్మడు ఉన్నట్టుండి ఇలా అన్నీ కప్పేసే దుస్తుల్లో వస్తే కాసింత కన్ఫ్యూజ్ అయి ఉంటారు. మరీ ఇంత సూటిగా హైదరాబాద్ అబ్బాయిల్ని విమర్శిస్తోందంటే కాస్త పొగరైనా ఉండాలి. లేక టెంపరితనం అయినా అయి ఉండాలని విమర్శలొస్తున్నాయి. అంతేకాదు.. మానస్వి మునుముందు తెలుగు సినిమాల్లో నటించాలని ఉందని అంటూనే కొన్ని ఘాటైన విమర్శలు చేయడం ప్రస్తుతం టీటౌన్‌లో విమర్శలకు దారితీసింది. తూ ఛీజ్ బడీ హై మస్త్ మస్త్.. అంటూ మొహ్రా సినిమాలో రవీనాటాండన్ వేసిన స్టెప్పుల్ని మర్చిపోలేకపోతున్నా అనేసింది.
ఇకపోతే భరతనాట్యం వంటి క్లాసిక్ డ్యాన్సుల్లో శిక్షణ పొందుతుందోట. తెలుగులో మగధీర, 1నేనొక్కడినే, ఎవడు వంటి సినిమాలు చూశాను. మునుముందు ఇక్కడ కూడా నటిస్తా. అయితే స్క్రిప్టు ఎంచుకోవడం అనేది అంత ఆషామాషీ కాదు. చాలా కష్టించాల్సి వస్తుంది.. అంటోంది మనస్వి.