Begin typing your search above and press return to search.
చరణ్ పై మంచు విష్ణు హాట్ కామెంట్స్
By: Tupaki Desk | 11 Aug 2019 4:15 AM GMTఈసారి జాతీయ అవార్డుల్లో `రంగస్థలం` చిత్రానికి అందులో చరణ్ నటనకు అవార్డు ఖాయం అని భావించారు మెగా ఫ్యాన్స్. ఊహించినది ఒకటి అయితే జరిగినది ఇంకొకటి! అన్న చందంగా ఆ సినిమా ఆడియోగ్రఫీకి అవార్డు ఇచ్చి నటీనటుల్ని పట్టించుకోకపోవడం అభిమానుల్ని నిరాశపరిచింది. అంధాధున్ లో నటనకు ఆయుష్మాన్ ఖురానాను.. ఊరిలో నటనకు విక్కీ కౌశల్ కి ఉత్తమ నటులుగా అవార్డులు దక్కాయి. అయితే రంగస్థలంలో చరణ్ నటన దేనికి తీసిపోయింది? అంటూ జాతీయ అవార్డులు ప్రకటించిన అనంతరం రామ్ చరణ్ అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ అవార్డుల ప్రహసనంపై సామాజిక మాధ్యమాల్లో హీరో మంచు విష్ణు స్పందించారు. ``జాతీయ అవార్డులు గెలుచున్న వారితో నాకు ఎలాంటి విభేదాలు లేవు. కానీ సోదరుడు రామ్ చరణ్ రంగస్థలం చిత్రంలో నటనకు ఉత్తమ నటుడిగా అన్ని విధాలా అర్హుడు. నా అభిప్రాయాన్ని నిజాయతీగా చెబుతున్నా. చరణ్ ఆ చిత్రంలో ఉత్తమ నటన కనబరిచాడు. ఇటీవల కాలంలో అలాంటి నటనని మరే నటుడిలోనూ చూడలేదు. ఆడియెన్ ప్రేమాభిమానాలే అతి పెద్ద అవార్డ్`` అని వ్యాఖ్యానించారు.
జాతీయ అవార్డ్ మిస్సయినా రామ్ చరణ్ కి తాజాగా `సాక్షి` ఎక్సలెన్స్ `ఉత్తమ నటుడి` అవార్డ్ దక్కింది. ఈ సందర్భంగా చరణ్ అవార్డుల వేదికపై మాట్లాడుతూ... ఇటీవల నిజాయతీగా జనాలు ఓటు వేసి అవార్డులు రావడం అనేది చాలా అరుదు. ఓ జ్యూరీ కమిటీ అంతా కూర్చుని ఎంపిక చేస్తారు. అయితే జనాల్లో నుంచి వచ్చినప్పుడే అది నిజమైన అవార్డు. ఓటింగ్ సిస్టమ్ ద్వారా నాకు దక్కిన అవార్డ్ ఇది`` అని అన్నారు. ``ఆ వ్యక్తి లేకుంటే.. నన్ను కలవకపోయి ఉంటే ఈ అవార్డు లేదు. చాలా మొండోడు.. గట్టోడు. ఏదైనా సాధించేవరకూ వదలడు. పెన్ను పట్టుకుని పేపర్ మీద రాయడం మొదలు పెడితే కథతో.. డైలాగులతో.. పాత్రలతో ప్రేమలో పడిపోతారు... ఆయనే సుకుమార్. స్కూల్ టీచర్ లా ఈ లెక్కల మాస్టార్ చెక్కుతూ నటన రాబట్టుకున్నారు..`` అంటూ `రంగస్థలం` దర్శకుడు సుకుమార్ పైనా చరణ్ ప్రశంసలు కురిపించారు.