Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: మంచు లక్ష్మి ఓ డైమండ్

By:  Tupaki Desk   |   9 Oct 2019 4:55 AM GMT
ఫోటో స్టోరీ: మంచు లక్ష్మి ఓ డైమండ్
X
డైనమిక్ లేడీ మంచు లక్ష్మి తన పుట్టినరోజు అక్టోబర్ 8 వ తేదీన జరుపుకున్నారు. లెజెండరీ యాక్టర్ మోహన్ బాబు కుమార్తెగా మాత్రమే కాదు.. ఒక టీవీ హోస్టుగా.. నటిగా.. నిర్మాతగా మంచు లక్ష్మి తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. టాలీవుడ్ లో మంచు లక్ష్మి చాలామంది సెలబ్రిటీలతో ఫ్రెండ్లీగా ఉంటారు. దీంతో మంచు లక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే ఈ బర్త్ డే విషెస్ అన్నిటిలో స్పెషల్ మాత్రం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నుంచి వచ్చినదే.

మంచు ఫ్యామిలీతో.. ముఖ్యంగా లక్ష్మితో రకుల్ చాలా సన్నిహితంగా ఉంటుందనే విషయం తెలిసిందే. మంచు మనోజ్ సినిమాలో రకుల్ హీరోయిన్ గా నటించిన సమయం నుంచి రకుల్ కు ఈ సాన్నిహిత్యం ఏర్పడింది. సమయం దొరికితే చాలు.. ఇద్దరూ చిల్ అవుట్ అవుతుంటారు. అందుకే రకుల్ తన ఇన్స్టా ఖాతా ద్వారా మూడు ఫోటోలు పోస్ట్ చేసి ఒక లాంగ్ క్యాప్షన్ ఇచ్చింది. "అమ్మాయిలకు బెస్ట్ ఫ్రెండ్స్ వజ్రాలు కాదు.. వజ్రం లాంటి ఒక బెస్ట్ ఫ్రెండ్! హ్యాపీ బర్త్ డే టు మై సోల్ సిస్టర్ లక్ష్మి మంచు. నువ్వు చాలా స్ట్రాంగ్.. బ్రైట్.. స్పెషల్. నువ్వెలా ఉన్నావో అలా ఉన్నందుకు నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. నువ్వు ఇలానే మెరుస్తూ ఉండాలి. ఇలాంటి ఎన్నో పుట్టిన రోజులకు నేను హాజరవుతూనే ఉంటాను" అంటూ ఒక ఎమోషనల్ సందేశాన్నిచ్చింది.

ఈ సందర్భంగా రకుల్ పోస్ట్ చేసిన ఫోటోలలో ఒకటి సూపర్ గా ఉంది. మంచు లక్ష్మి వెనక నుంచి రకుల్ ను హగ్ చేసుకున్న ఫోటో అది. ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ సూపర్ పోజిచ్చారు. ఫ్రెండ్ షిప్ కు సిసలైన చిరునామా లాగా ఉన్నారు. మరో రెండు ఫోటోలు కూడా ఇద్దరి ఫ్రెండ్షిప్ కు ఎగ్జాంపుల్స్ లాగా ఉన్నాయి. ఈ పోస్టుకు ఇన్స్టాలో చాలామంది నెటిజన్లు లైక్స్ కొట్టడమే కాదు.. సూపర్ ఫ్రెండ్ షిప్ అంటూ మెచ్చుకున్నారు.