Begin typing your search above and press return to search.
మంచు లక్ష్మితో కళాంజలి చీర కట్టించిన రామోజీ
By: Tupaki Desk | 10 Dec 2016 9:13 AM GMTతెలుగు నాట ఉన్న వ్యాపారవేత్తల్లో రామోజీ స్టైలే స్పెషల్. హంగు, ఆర్భాటం లేకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ సంపాదించడమెలాగో ఆయనకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదేమో. పచ్చళ్ల నుంచి పేపరు వరకు.. అన్నిట్లోనూ టాప్ బ్రాండ్లను మెంటైన్ చేస్తున్న రామోజీ పబ్లిసిటీకి మాత్రం చాలా తక్కువ ఖర్చు చేస్తారు. అన్ని సంస్థలూ పెద్దపెద్ద స్టార్లను అంబాసిడర్లుగా వాడుకున్నా రామోజీ మాత్రం అదేమీ లేకుండా ప్రమోట్ చేసుకుంటారు.
అయితే.. మారుతున్న కాలంతోపాటు మనమూ మారాలనుకున్నారో ఏమో ఈమథ్య కాలంలో కాస్త సెలబ్రిటీల బాట పడుతున్నారు. మార్గదర్శి గ్రూప్ కోసం ప్రపంచ మాజీ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకుని ఆయనతో ప్రచారం చేయిస్తున్నారు. తాజాగా తన దుస్తుల వ్యాపారం కళాంజలి సంస్థ కోసం మంచు లక్ష్మిని రంగంలోకి దించారు.
ఇంతకుముందు కళాంజలి యాడ్స్ లో కనిపించేవారెవరూ ప్రముఖులు కారు. కనీసం తన ఈటీవీ సీరియళ్లలో నటించినవారిని కూడా ఎప్పుడూ ప్రచారానికి వాడలేదు. ఊరూపేరు లేని మోడల్స్ తోనే కథ నడిపించేసేవారు. ఈసారి మాత్రం ఎందుకో మంచులక్ష్మితో కళాంజలి చీరలు కట్టించి పబ్లిసిటీ మొదలుపెట్టారు. మరి ఇది రామోజీ ఇంట్రెస్టా లేదంటే మంచు లక్ష్మి ఇంట్రస్టా అన్నది తెలియాలి.