Begin typing your search above and press return to search.

మంచు లక్ష్మి పుసుక్కున అంతమాట అనేసిందే!

By:  Tupaki Desk   |   11 July 2019 2:19 PM GMT
మంచు లక్ష్మి పుసుక్కున అంతమాట అనేసిందే!
X
సందీప్ వంగా సినిమా అంటే ఖచ్చితంగా వివాదాలు ఉండాలేమో మరి. 'అర్జున్ రెడ్డి' ఎంత క్లాసిక్ అనిపించుకున్నా ఆ సినిమాపై విమర్శలు తప్పలేదు. ఇప్పుడు 'కబీర్ సింగ్' విషయంలో కూడా అదే సీన్ రిపీట్ అయింది. సూపర్ డూపర్ హిట్ అయ్యి 'కబీర్ సింగ్' రూ.300 కోట్ల మార్క్ దిశగా పయనిస్తోంది. మెజారిటీ ప్రేక్షకులకు తెగ నచ్చింది. అయితే విమర్శలకు ఏమాత్రం కొదవలేదు. ఇప్పుడు చర్చలు 'కబీర్ సింగ్' నుంచి సందీప్ వంగా లవ్ పై చేసిన కామెంట్స్ పైకి మళ్ళాయి.

లవ్ కు సందీప్ ఇచ్చిన కొత్త డెఫినిషన్ నిజంగా చాలామందికి కొరుకుడుపడడం లేదు. తన సినిమాలో కబీర్ - ప్రీతిల పాత్ర స్వభావాన్ని బట్టి అలా చెంపదెబ్బలు కొట్టుకుంటారు.. అని లాజిక్ చెప్తే ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయరు కానీ "అసలు కొట్టుకునేంత చనువు.. నిజాయితీ లేకపోతే అది రియల్ లవ్ కాదు" అని సూత్రీకరణ చేయడంతో చిక్కొచ్చిపడింది. చెంపదెబ్బలు కొట్టుకోకుండా ఉండేవారిని సందీప్ ఎలా లవ్ కాదని అంటున్నాడో.. వారు ఈ చెంపదెబ్బల లవ్వును ఏకి పారేస్తున్నారు. తాజాగా మైథాలజీ జోనర్ లో పలు బుక్స్ రాసిన పాపులర్ రచయిత దేవదత్ పట్నాయక్ సందీప్ కామెంట్స్ పై స్పందించాడు. ఆయన తన ట్విట్టర్ ద్వారా "నిజమైన ప్రేమికులు చెంపలు వాయించుకుంటారు అనేది బాలీవుడ్ తరహా లవ్వు.. కానీ అది ఖచ్చితంగా పురాణాల ప్రకారం ప్రేమ కాదు" అంటూ ట్వీట్ చేశారు.

అయితే ఈ ట్వీట్ కు మన టాలీవుడ్ సెలబ్రిటీ మంచు లక్ష్మి "ఓ గాడ్.. బాలీవుడ్ అంతా కాదు. ఒక శాడ్ ఫిలిం మేకర్! మాలో ఎక్కువమంది మా సినిమాల్లో లవ్.. సాంగ్.. డ్యాన్స్.. ఫ్రెండ్ షిప్ ను నమ్ముతాం. అలాంటి సినిమాలను రానివ్వండి" అంటూ రిప్లై ఇచ్చారు. అంటే.. సందీప్ వంగాకు ఇన్ డైరెక్ట్ గా పంచ్ వేసినట్టే. ఇప్పటికే సమంతా.. చిన్మయి లాంటి వారు సందీప్ కామెంట్స్ ను ఖండించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ రిప్లై తో మంచు లక్ష్మి కూడా తన స్టాండ్ చెప్పకనే చెప్పింది. అయితే సందీప్ ను సపోర్ట్ చేసే నెటిజన్లు ఊరుకోరు కదా.. మంచు లక్ష్మిపై గట్టిగా సెటైర్లు వేశారు. "మే బీ నువ్వు రియల్ లవ్ చూడలేదేమో".. "సందీప్ ఇంటలిజెన్స్ ను అర్థం చేసుకునే స్థాయి మీకు లేదు".. "శాడ్ ఫిలిం మేకర్ సినిమాకు 250 కోట్లు వచ్చాయి" అంటూ కామెంట్లు పెట్టారు.